'అందమైన మాయ' డిసెంబర్ 19న విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
విశ్వ శ్రీ ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకం పై మణింద్రన్ దర్శకత్వం లో కొట్టే నాగరాజు యాదవ్ నిర్మాతగా కార్తీక్, భవ్య శ్రీ, హేమంత్ ,ఝాన్సీ మరియు శ్రుతిజ ముఖ్య పాత్రలలో నిర్మించిన చిత్రం అందమైన మాయ. ఈ చిత్రం అన్ని క్రాయక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల డిసెంబర్ 19న విడుదలకు సిద్ధం గా ఉంది.
హీరో హేమంత్ మాట్లాడుతూ .. నాకు ఈ అవకశం ఇచ్చిన నాగరాజు సర్ గారికి థాంక్స్ చేబుతునాను ..
ఈ రోజు సినిమా లో నాతో పాటుగా నటించిన అందరు, కొత్త వారు ..ఇంత మంది కొత్త వారిని ఇండస్ట్రీ కి పరిచయం చేస్తున్న నాగరాజు సర్ కి థాంక్స్ చేబుతునాను.సినిమా ఇంత బాగా తిసిని డైరెక్టర్ సర్ గారికి థాంక్స్ .
ఈ సందర్భంగా నిర్మాత కొట్టే నాగరాజు మాట్లాడుతూ " మా చిత్రం అనుకున్న దానికంటే బాగా వచ్చింది. మా అందమైన మాయ చిత్రం మన తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఒరిస్సా మరియు ఇతర దేశాలలో కూడా భారీ ఎత్తున సుమారు 120 థియేటర్ లలో ఈ నెల డిసెంబర్ 19న విడుదల అవుతుంది. మాకు ఎంతగానో సహకారం అందించిన మా డిస్ట్రిబ్యూటర్ మరియు బయర్స్ కు మా ప్రత్యేక ధన్యవధాలు. ఈ చిత్రా నిర్మాణానికి సహకరించిన మా శ్రేయోభాలాషి జాకీర్ హుస్సైన్ జావీద్ గారికి మా ప్రత్యేక దన్యావధాలు. ఈ చిత్రనికి సహకరించిన మీడియా మిత్రులకు మా ప్రత్యేక దన్యావధాలు".
దర్శకుడు మణింద్రన్ మాట్లాడుతూ " మా అందమైన మాయ చిత్రని ప్రతి డిస్ట్రిబ్యూటర్ కు షో వేసి బిజినెస్ చేశాము.అందరు కొత్త వాళ్ళతో చేసిన మొదటి తెలుగు సినిమా ఈ మా "అందమైన మాయ" . నా ప్రతిభను గుర్తించి సినిమా అవకాశం ఇచ్చిన నా నిర్మాత నాగరాజు గారికి కృతజ్ఞతలు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 120 థియేటర్ లో విడుదల అవుతుంది. ఈ మధ్య విడుదల అవుతున్న హారర్ సినిమా లలో ఇది చాలా కొత్తగా ఉంటుంది. ఈ చిత్రం లో మీరు ఊహించని ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి. మా ఈ చిత్రని ఆదరించి సూపర్ హిట్ చేస్తారని కోరుకుంటున్నాను"
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments