Varshini Sounderajan : బ్లాక్ ఔట్‌ఫిట్‌లో మతెక్కిస్తోన్న వర్షిణీ... అదరహో అనాల్సిందే
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు బుల్లితెరపై భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న అతికొద్దిమంది యాంకర్లలో వర్షిణీ సౌందరరాజన్ ఒకరు . చూడచక్కని రూపంతో , మత్తెక్కించే కళ్లతో కుర్రకారుకు గిలిగింతలు పెడుతూ వుంటారు వర్షిణీ. పటాస్ షోకు యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు యూత్‌లో మంచి క్రేజ్ వుంది. అటు తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ , మోడలింగ్, సినిమాల్లోనూ దూసుకెళ్తోంది. లవర్స్, కాయ్ రాజా కాయ్, బెస్ట్ యాక్టర్స్ వంటి చిత్రాల్లోనూ నటించింది. అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మించిన పెళ్లిగోల అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
వచ్చే మార్చిలో వర్షిణీ పెళ్లంటూ వార్తలు:
మిగిలిన యాంకర్స్ మాదిరిగానే వర్షిణీ విషయంలోనూ బోల్డన్నీ గాసిప్స్ వచ్చాయి. ఫలానా వ్యక్తితోనో, నటుడితోనో ఆమె రిలేషన్‌షిప్‌లో వుందంటూ కథనాలు వచ్చాయి. మొన్నామధ్య జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదితో వర్షిణి క్లోజ్‌గా వున్న ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. కట్ చేస్తే వీరిద్దరి మధ్య ఏం లేదని అవి గాలివార్తలేనని తేలింది. తర్వాత సొంత బావతో వర్షిణికి పెళ్లి ఫిక్స్ అయ్యిందని.. ఇరు కుటుంబాలు అంగీకరించాయని, వచ్చే మార్చిలో పెళ్లి వుంటుందని కూడా వార్తలు వచ్చాయి. తర్వాత దీనికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు.
ఎద అందాలతో ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సిందే:
ఇక.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా వుండే వర్షిణీ ఎప్పటికప్పుడు తన షోలు, వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ వుంటారు. అలాగే హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది ఈ పటాస్ భామ. తాజాగా వర్షిణీ షేర్ చేసిన బ్లాక్ టాప్ ఔట్‌ఫిట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎద అందాలు చూపిస్తూ, కనపడి కనపడకుండా వున్న నడుముతో ఈ అమ్మడు చక్కిలిగింతలు పెడుతోంది. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com