తప్పుడు కేసు పెట్టారు.. ప్రాపర్ డీటైల్స్‌తో వస్తా: యాంకర్ శ్యామల భర్త
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ యాంకర్, బిగ్‌బాస్ ఫేం శ్యామల భర్త నర్సింహారెడ్డి తనపై నమోదైన చీటింగ్ కేసు విషయమై తాజాగా స్పందించాడు. దేవుడి దయ వల్ల తాను ఇంటికి తిరిగి వచ్చానని.. తనపై తప్పుడు కేసు పెట్టారని వెల్లడించాడు. అసలు ఆ కేసు ఏమిటి? అందులో నిజానిజాలేమిటి? అనే విషయాల్ని అన్ని రకాల ఆధారాలతో వెల్లడిస్తానని నర్సింహ ఓ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను యాంకర్ శ్యామల తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. వీడియోలో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం తనకు, తన కుటుంబానికి అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. కొన్నిసార్లు నిదలు పడాల్సి వస్తుందని.. అయితే వచ్చిన పుకార్లపై తప్పక స్పందించాల్సిన అవసరం ఉందని నర్సింహ వెల్లడించాడు. రెండు రోజుల్లోనే మీ ముందుకు రావడాన్ని బట్టి అదెంత తప్పుడు కేసో మీకే అర్థమవుతుందని నర్సింహ పేర్కొన్నాడు.
‘నాపై ఎన్నో మోసపూరిత ఆరోపణలు వచ్చినప్పటికీ నాకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. ఆ దేవుడి దయ వల్ల నేను తొందరగా ఇంటికి తిరిగి వచ్చేశాను. గత రెండు రోజులుగా సోషల్‌మీడియాలో నా గురించి వస్తోన్న కథనాలు, కథల గురించి విషయాలను షేర్ చేసుకోవడానికి మరికొన్ని రోజుల్లో మీ ముందుకు వస్తాను. ప్రాపర్ డీటైల్స్‌తో వస్తాను. కేసు ఏమిటి? అందులోని నిజానిజాలేమిటి? అన్ని మీతో చర్చిస్తా. ఇలా అన్నిరకాల ఆధారాలతో మిమ్మల్ని కలుస్తాను. అప్పుడు మీకే నిజాలన్నీ తెలుస్తాయి. అప్పుడు మీకే ఓ అంచనా వస్తుంది. కోర్టు, న్యాయంపైనా నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇది తప్పుడు కేసు అనడానికి ఆధారం ఏంటంటే నేను రెండే రెండు రోజుల్లోనే మీ ముందుకు వచ్చాను. దీన్ని బట్టి ఎంత తప్పుడు కేసు అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంటుంది. రేపో, ఎల్లుండో పూర్తి ఆధారాలతో మీ ముందుకు వస్తాను’’ అని నరసింహారెడ్డి తెలిపారు.
కాగా.. నర్సింహారెడ్డిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. పలు సీరియళ్ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నర్సింహపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గండిపేటలో రూ.100 కోట్ల విలువ చేసే నాలుగు ఎకరాల స్థలం ఉందని, దాంట్లో ఈతకొలను, పబ్, గేమ్ జోన్ వంటివి అభివృద్ధి చేసేందుకు పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదిస్తూ.. 2017 ఆగస్టులో తన వద్ద నుంచి లక్ష్మీ నరసింహారెడ్డి రూ.85 లక్షలు నగదు తీసుకున్నాడని పేర్కొంటూ ఇటీవల ఖాజాగూడకు చెందిన సింధూరారెడ్డి ఆయనపై కేసు పెట్టింది. డబ్బుల విషయం అడిగితే బెదిరింపులకు నర్సింహా బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలోనే పోలీసులు నరసింహారెడ్డితోపాటు ఆయనకు సాయం చేసిన జయంతి గౌడ్ అనే మహిళను సైతం అరెస్టు చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com