Anchor Suma:మీడియాకు క్షమాపణలు చెప్పిన యాంకర్ సుమ.. ఎందుకంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినీ ఇండస్ట్రీలో ఏ ఈవెంట్ జరిగిన ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఉంటారు. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల సినిమాల వరకు ఆమె యాంకరింగ్ లేని ఫంక్షన్ ఉండదంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు. ప్రస్తుత యాంకర్‌లు కూడా సుమను ఫాలో అవుతూ ఉంటారు. తాజాగా మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఆదికేశవ’ సినిమాలోని ‘లీలమ్మో’ పాట విడుదల వేడుకకు సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఆమె ఓ వివాదంలో చిక్కుకున్నారు.
అసలు ఏమైందంటే..?
ఆ ఈవెంట్‌లో మీడియా వాళ్లను ప్రెస్‌మీట్‌కు ఆహ్వానిస్తూ "స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారు.. త్వరగా లోపలికి వచ్చి మీ కెమెరాలను ఇక్కడ పెట్టాలని కోరుతున్నాం" అని సెటైర్లు వేశారు. దీంతో అలా అనకుండా బాగుండేదని విలేకరులు తెలిపారు. మీడియా వారితో కలిసి తాను చాలా కాలంగా ప్రయాణం చేస్తున్నానని.. ఆ చనువుతోనే జోక్‌గా మాట్లాడానని సుమ సమాధానమిస్తూ "మీరు స్నాక్స్‌ను స్నాక్స్‌లానే తిన్నారు ఓకేనా?" అన్నారు. దీంతో మళ్లీ హర్ట్ అయిన ఓ విలేకరి "ఇదే వద్దనేది. మీ యాంకరింగ్ అందరికీ ఇష్టమేగానీ మీడియా విషయంలో ఇలాంటివి వద్దు" అని ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ క్రమంలో అప్పుడే వేదికపై మీడియా వాళ్లకు ఆమె క్షమాపణలు చెప్పారు.
నిండు మనసుతో క్షమాపణ కోరుతున్నా..
ఈవెంట్ అయిపోయిన తర్వాత కూడా క్షమాపణలు కోరుతూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘‘మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు నేనొక ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయని నాకు అర్థమవుతోంది. నిండు మనసుతో క్షమాపణ కోరుతున్నా. మీరెంత కష్టపడి పనిచేస్తారో నాకు తెలుసు. మీరు, నేను కలిసి కొన్నేళ్ల నుంచి ప్రయాణిస్తున్నాం. నన్ను ఓ కుటుంబ సభ్యురాలిగా భావించి క్షమిస్తారని ఆశిస్తున్నా’’అని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments