Anchor Suma:మీడియాకు క్షమాపణలు చెప్పిన యాంకర్ సుమ.. ఎందుకంటే..?

  • IndiaGlitz, [Thursday,October 26 2023]

ప్రముఖ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినీ ఇండస్ట్రీలో ఏ ఈవెంట్ జరిగిన ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఉంటారు. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల సినిమాల వరకు ఆమె యాంకరింగ్ లేని ఫంక్షన్ ఉండదంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు. ప్రస్తుత యాంకర్‌లు కూడా సుమను ఫాలో అవుతూ ఉంటారు. తాజాగా మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఆదికేశవ’ సినిమాలోని ‘లీలమ్మో’ పాట విడుదల వేడుకకు సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఆమె ఓ వివాదంలో చిక్కుకున్నారు.

అసలు ఏమైందంటే..?

ఆ ఈవెంట్‌లో మీడియా వాళ్లను ప్రెస్‌మీట్‌కు ఆహ్వానిస్తూ స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారు.. త్వరగా లోపలికి వచ్చి మీ కెమెరాలను ఇక్కడ పెట్టాలని కోరుతున్నాం అని సెటైర్లు వేశారు. దీంతో అలా అనకుండా బాగుండేదని విలేకరులు తెలిపారు. మీడియా వారితో కలిసి తాను చాలా కాలంగా ప్రయాణం చేస్తున్నానని.. ఆ చనువుతోనే జోక్‌గా మాట్లాడానని సుమ సమాధానమిస్తూ మీరు స్నాక్స్‌ను స్నాక్స్‌లానే తిన్నారు ఓకేనా? అన్నారు. దీంతో మళ్లీ హర్ట్ అయిన ఓ విలేకరి ఇదే వద్దనేది. మీ యాంకరింగ్‌ అందరికీ ఇష్టమేగానీ మీడియా విషయంలో ఇలాంటివి వద్దు అని ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ క్రమంలో అప్పుడే వేదికపై మీడియా వాళ్లకు ఆమె క్షమాపణలు చెప్పారు.

నిండు మనసుతో క్షమాపణ కోరుతున్నా..

ఈవెంట్ అయిపోయిన తర్వాత కూడా క్షమాపణలు కోరుతూ ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ‘‘మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు నేనొక ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయని నాకు అర్థమవుతోంది. నిండు మనసుతో క్షమాపణ కోరుతున్నా. మీరెంత కష్టపడి పనిచేస్తారో నాకు తెలుసు. మీరు, నేను కలిసి కొన్నేళ్ల నుంచి ప్రయాణిస్తున్నాం. నన్ను ఓ కుటుంబ సభ్యురాలిగా భావించి క్షమిస్తారని ఆశిస్తున్నా’’అని తెలిపారు.

 

 

More News

Sharmila:షర్మిల సంచలన నిర్ణయం.. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరం..

తెలంగాణ ఎన్నికల వేళ వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల సంచలనం నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు.

బాలయ్య ఖాతాలో మరో రూ.100కోట్లు సినిమా.. దసరా విన్నర్‌గా 'భగవంత్ కేసరి'

నటసింహం బాలకృష్ణ ఈ ఏడాది దసరా విన్నర్‌గా నిలిచారు. ఆయన నటించిన 'భగవంత్ కేసరి'(Bhagavanth Kesari) మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Chandrababu Babu:చంద్రబాబు వెంట డీఎస్పీలు పెట్టాలన్న సీఐడీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు

టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై అదనపు షరతులు విధించాలంటూ సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెల్లడించింది.

రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి తిట్ల పురాణం సోషల్ మీడియాలో వైరల్..

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. అయితేకాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..

జీ5లో 50 మిలియ‌న్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌ రాబట్టిన 'ప్రేమ విమానం'

దేశ వ్యాప్తంగా వైవిధ్యమైన కంటెంట్‌తో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను కోరుకునే ప్రేక్షకుల‌ను మెప్పిస్తోన్న వ‌న్ అండ్ ఓన్లీ ఓటీటీ జీ5. తాజాగా అక్టోబ‌ర్ 13 నుంచి 'ప్రేమ విమానం’