SreeMukhi : ఎర్ర కోక కట్టి నడుము, బొడ్డు చూపిస్తూ... కేక పుట్టిస్తోన్న రాములమ్మ
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు బుల్లితెరను ఏలుతున్న కొద్దిమంది స్టార్ యాంకర్స్‌లో శ్రీముఖి ఒకరు. ముద్దుగా, బొద్దుగా , చలాకీతనంతో వుండే ఈమెకు మంచి ఫ్యాన్ బేస్ వుంది. అదుర్స్ అనే కార్యక్రమంతో చిన్ని తెరపై తన ప్రస్థానం మొదలెట్టిన శ్రీముఖి.. తన టైమింగ్‌తో, పంచ్‌లతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ ఫాలోయింగ్తోనే సినిమాల్లోనూ హీరోయిన్గా చేసింది. అది అంతగా అచ్చి రాకపోవడంతోనే చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూనే, బుల్లితెరపై మాత్రం స్టార్‌గా వెలుగొందుతోంది. అంతేకాదు.. చిన్ని తెరకు గ్లామర్ సొబగులు అద్దిన అతికొద్దిమంది బ్యూటీల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 3లో అడుగుపెట్టి రన్నరప్‌గా నిలిచింది. ప్రస్తుతం శ్రీముఖీ జీ5లో ప్రసారమవుతోన్న సరిగమప: ది సింగింగ్ సూపర్‌స్టార్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
వెండితెరపైనా అదే జోష్:
శ్రీముఖి నటించిన సినిమాల విషయానికి వస్తే.. 2012లో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన జులాయిలో హీరో చెల్లెలిగా నటించారు. తర్వాత నేనుశైలజాలో చాక్లెయ్ బాయ్ రామ్‌కు సిస్టర్‌గా సంది చేశారు. ఈ ఏడాది ఇట్స్ టైమ్ టూ పార్టీ అనే సినిమా చేస్తున్నారు శ్రీముఖి. అయితే ఆమె ఓ వ్యక్తితో రిలేషన్లో వున్నారంటూ అప్పట్లో ఓ వార్త గుప్పమనగా.. తర్వాత ఎవ్వరూ దానిపై మాట్లాడలేదు.
హాట్ ఫోటో షూట్లతో రాములమ్మ రచ్చ:
ఇక .. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే శ్రీముఖి తన వ్యక్తిగత, కుటుంబ విషయాలను, షోలకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఎప్పటికప్పుడు టచ్‌లో వుంటారు. ఇక హాట్ హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెడుతోంది. ఈ నేపథ్యంలో గత కొన్నిరోజులుగా శ్రీముఖి రెచ్చిపోతోంది. గ్యాప్ లేకుండా తనలోని గ్లామర్ యాంగిల్స్ వదులుతూ అందాలతో గాలం వేస్తోంది. తాజాగా బీచ్‌లో ఎర్ర చీర కట్టి మత్తెక్కించే చూపులతో రెచ్చగొడుతోంది. ఆ ఫోటోల్లో కొండకోనల్లో నడుము, నాభి చూపిస్తూ అందాల విందు చేసింది. దీంతో ఈ ఫోటోలు షేర్ చేసిన కొద్దిసేపటికే వైరల్ అవుతున్నాయి. మరి ఈ ఫోటోల్ని మీరు కూడా ఓ లుక్కేయండి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com