sreemukhi : కొత్తింట్లోకి అడుగుపెట్టిన శ్రీముఖి... పేరెంట్స్‌తో రాములమ్మ, ఫోటోలు వైరల్

  • IndiaGlitz, [Friday,December 16 2022]

తెలుగు బుల్లితెరను ఏలుతున్న కొద్దిమంది స్టార్ యాంకర్స్‌లో శ్రీముఖి (SreeMukhi) ఒకరు. ముద్దుగా, బొద్దుగా , చలాకీతనంతో వుండే ఈమెకు మంచి ఫ్యాన్ బేస్ వుంది. అదుర్స్ అనే కార్యక్రమంతో చిన్ని తెరపై తన ప్రస్థానం మొదలెట్టిన శ్రీముఖి.. తన టైమింగ్‌తో, పంచ్‌లతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ ఫాలోయింగ్‌తోనే సినిమాల్లోనూ హీరోయిన్‌గా చేసింది. అది అంతగా అచ్చి రాకపోవడంతోనే చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూనే, బుల్లితెరపై మాత్రం స్టార్‌గా వెలుగొందుతోంది. అంతేకాదు.. చిన్ని తెరకు గ్లామర్ సొబగులు అద్దిన అతికొద్దిమంది బ్యూటీల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 3లో అడుగుపెట్టి రన్నరప్‌గా నిలిచింది. ప్రస్తుతం శ్రీముఖీ జీ5లో ప్రసారమవుతోన్న సరిగమప: ది సింగింగ్ సూపర్‌స్టార్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

వెండితెరపైనా అదే జోష్:

శ్రీముఖి (Actress SreeMukhi)నటించిన సినిమాల విషయానికి వస్తే.. 2012లో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన జులాయిలో హీరో చెల్లెలిగా నటించారు. తర్వాత నేనుశైలజాలో చాక్లెయ్ బాయ్ రామ్‌కు సిస్టర్‌గా సంది చేశారు. ఈ ఏడాది ఇట్స్ టైమ్ టూ పార్టీ అనే సినిమా చేస్తున్నారు శ్రీముఖి. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్‌లోనూ ఆమెకు ఛాన్స్ దక్కింది.

కొత్తింట్లోకి అడుగుపెట్టిన శ్రీముఖి:

ఇదిలావుండగా ఇటీవలికాలంలో వెండితెర, బుల్లితెర నటీనటులు ఒక్కొక్కరిగా గృహ ప్రవేశాలు చేస్తున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తమ కలల సౌధాన్ని నిర్మించి సొంతింట్లోకి అడుగుపెడుతున్నారు. కొద్దిరోజుల క్రితం యూట్యూబ్ స్టార్ దీప్తి సునైన, తీన్మార్ శివజ్యోతి, బుల్లితెర నటి శ్రీవాణిలు గృహ ప్రవేశాలు చేశారు. తాజాగా ఈ లిస్ట్‌లో చేరారు శ్రీముఖి. ఓ కొత్త ఇల్లు కొనుగోలు చేసిన ఆమె.. తాజాగా కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశం చేశారు. అలాగే ఫ్యామిలీ మెంబర్స్‌తో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More News

Amardeep - Tejaswini Gowda Wedding: ఘనంగా అమర్ దీప్, తేజశ్విని వివాహం.. ఫోటోలు వైరల్

ప్రస్తుతం వెండితెర, బుల్లితెర నటీనటులు తమ బ్యాచిలర్ లైఫ్‌కి ఫుల్ స్టాప్ పెట్టి వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు.

Korameenu: 'కొరమీను' సినిమా నుంచి మెలోడీ సాంగ్ ‘మీనాచ్చి మీనాచ్చి..’ రిలీజ్

ప్రేమ‌కు పేద‌, ధ‌నిక అనే బేదం ఉండ‌దు. మ‌న‌సుకు న‌చ్చిన వారు క‌న‌ప‌డితే చాలు వెంట‌నే ప్రేమ పుడుతుంది.

Macherla Niyojakavargam: 75 మిలియ‌న్స్ వ్యూయింగ్ మినిట్స్ సాధించిన చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'

మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా ప్రేక్ష‌కుడు అభిరుచి మారిపోతుంది.

Waltair Veerayya : వాల్తేరు వీరయ్య’‌ కోసం లెజెండరీ సింగర్.. పదిహేనేళ్ల తర్వాత మళ్లీ మెగాస్టార్ సినిమాలో

ఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘‘వాల్తేర్ వీరయ్య’’. చిరు వీరాభిమాని బాబీ (కేఎస్ రవీంద్ర) దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

Actress Abhinaya: కట్నం కోసం వదినకు వేధింపులు.. సీనియర్ నటి అభినయకు రెండేళ్ల జైలు

వరకట్న వేధింపుల కేసులో సీనియర్ నటి అభినయ (Kannada actress Abhinaya)జైలు పాలయ్యారు. వివరాల్లోకి వెళితే..