వైసీపీ కండువా కప్పుకున్న ప్రముఖ యాంకర్..

  • IndiaGlitz, [Monday,April 01 2019]

ఏపీలో సరిగ్గా మరో పదిరోజుల్లో ఎన్నికలు జరగనుండగా వైసీపీలోకి చేరికలు భారీగా జరుగుతున్నాయి. అటు రాజకీయ నేతలు.. ఇటు సెలబ్రిటీలకు కండువాలు కప్పే పనిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు.

ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వైసీపీ తీర్థం పుచ్చుకోగా సోమవారం నాడు టాలీవుడ్ ప్రముఖ నటుడు జీవిత, రాజశేఖర్ దంపతులు, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ, ప్రముఖ యాంకర్ శ్యామల దంపతులు పార్టీలో చేరారు. వీరందరికీ వైఎస్ జగన్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాగా కండువా కప్పుకున్న అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి, జగన్‌ను సీఎం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు.

కాగా.. ఇప్పటికే సీనియర్ నటుడు మోహన్ బాబు, విజయ్ చందర్, భానుచందర్, అలీ, పోసాని కృష్ణ మురళీ, థర్టీ ఇయర్స్ పృథ్వీ, జయసుధ, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, మంచు విష్ణు, మా మాజీ అధ్యక్షులు శివాజీ రాజా, తనీష్‌‌తో పాటు పలువురు ప్రముఖులు, నటీనటుమణులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా వీరంతా ప్రస్తుతం వైసీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉంటున్నారు.

More News

బాలయ్యపై విజయసాయిరెడ్డి వివాదాస్పద ట్వీట్!

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణపై.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

యువత మనసు దోచుకున్న ‘మజిలి’!

శివ నిర్వాణ ద‌ర్శకత్వంలో అక్కినేని నాగ‌చైత‌న్య, స‌మంత జంట‌గా న‌టించిన సినిమా ‘మ‌జిలి’. ఆదివారం నాడు సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.

నాన్న రాజ‌కీయాల్లోకి రావ‌డం అవ‌స‌రం - శ్రుతిహాస‌న్‌

నాకు రాజ‌కీయాలు గురించి పెద్ద‌గా తెలిసేది కాదు. కానీ నాన్న రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసిన త‌ర్వాత నాకు ఆస‌క్తి ఏర్ప‌డింది.

తాగి ఊగిన వ్యవహారంపై వైసీపీ అభ్యర్థి రియాక్షన్

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు తాగి ఊగి ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు గత రెండ్రోజులుగా ఓ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్!

టైటిల్ చూడగానే ఇదేంటి..? పెళ్లి కాకుండానే తల్లికావడం ఎలా సాధ్యం..? ఓహ్ సినిమాలో ఇలా నటిస్తోందా..? అని అనుకుంటున్నారేమో.. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్లే.