వైసీపీ కండువా కప్పుకున్న ప్రముఖ యాంకర్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో సరిగ్గా మరో పదిరోజుల్లో ఎన్నికలు జరగనుండగా వైసీపీలోకి చేరికలు భారీగా జరుగుతున్నాయి. అటు రాజకీయ నేతలు.. ఇటు సెలబ్రిటీలకు కండువాలు కప్పే పనిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు.
ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వైసీపీ తీర్థం పుచ్చుకోగా సోమవారం నాడు టాలీవుడ్ ప్రముఖ నటుడు జీవిత, రాజశేఖర్ దంపతులు, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ, ప్రముఖ యాంకర్ శ్యామల దంపతులు పార్టీలో చేరారు. వీరందరికీ వైఎస్ జగన్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాగా కండువా కప్పుకున్న అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి, జగన్‌ను సీఎం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు.
కాగా.. ఇప్పటికే సీనియర్ నటుడు మోహన్ బాబు, విజయ్ చందర్, భానుచందర్, అలీ, పోసాని కృష్ణ మురళీ, థర్టీ ఇయర్స్ పృథ్వీ, జయసుధ, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, మంచు విష్ణు, మా మాజీ అధ్యక్షులు శివాజీ రాజా, తనీష్‌తో పాటు పలువురు ప్రముఖులు, నటీనటుమణులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా వీరంతా ప్రస్తుతం వైసీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com