Anchor Shyamala : బ్లూ శారీలో శ్యామల హాట్ లుక్స్.. మేకప్ వికటించిందా , ఏకీపారేస్తున్న నెటిజన్లు
Send us your feedback to audioarticles@vaarta.com
సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న తెలుగు యాంకర్లలో శ్యామల ఒకరు. పెళ్లయి, ఒక బిడ్డకు తల్లయినా శ్యామల ఫిగర్లో కొంచెం కూడా మార్పు రాలేదు. మొన్నామధ్య స్టార్ డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ సైతం.. తన చూపుల నుంచి మీరు ఎలా తప్పించుకున్నారంటూ శ్యామల అందానికి ఫిదా అయ్యారు. ఇక బొద్దుగా మారకుండా ఎప్పటికప్పుడు వర్కౌట్స్ , డైట్ చేసి నాజూకుగా మారుతున్నారు శ్యామల.
హాట్ ఫోటో షూట్లతో కుర్ర హీరోయిన్లకు పోటీ :
సోషల్ మీడియాలో చురుగ్గా వుండే శ్యామలకు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. తన సినిమాలు, షోలు, వ్యక్తిగత వివరాలను ఆమె ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ వుంటారు. అలాగే హాట్ ఫోటో షూట్లో కుర్ర హీరోయిన్లకు సవాల్ విసురుతూ వుంటారు శ్యామల.
అందం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న తారలు:
అయితే అందంగా కనిపించేందుకు సినీ తారలు, బుల్లితెర సెలబ్రెటీలు ముఖంలోని పలు భాగాలకు సర్జరీలు చేయించుకోవడంతో పాటు లావెక్కకుండా డైటింగ్లు, కొవ్వు పెరిగితే దానిని శస్త్రచికిత్స ద్వారా తొలగించుకుంటూ వుంటారు. అయితే కొన్నిసార్లు ఈ అందాల కోసం పడే తపన ప్రాణాల మీదకు వస్తూ వుంటుంది. మితిమిరీన డైట్స్, కాస్మోటిక్స్ వాడకం, సర్జీల వల్ల పలువురు నటీమణులు ప్రాణాలు సైతం కోల్పోయిన సంగతి తెలిసిందే.
శ్యామల మేకప్ ఓవర్డోస్:
తాజాగా యాంకర్ శ్యామల షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లూ ట్రాన్స్పరెంట్ శారీ, డీప్ నెక్ బ్లౌజ్లో నడుము చూపిస్తూ వున్న శ్యామల అందాలు మత్తెక్కిస్తున్నాయి. అయితే ఈ ఫోటోల్లో శ్యామల మేకప్ ఓవర్ డోస్ అయినట్లుగా కనిపిస్తోంది. ఐబ్రెస్, లిప్స్, ముఖానికి వేసిన మేకప్ వికటించినట్లుగా అనిపిస్తోంది. దీంతో ఆమె లుక్ గతంలో కంటే భిన్నంగా వుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై శ్యామల ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments