పోలీసులను ఆశ్రయించిన యాంకర్ రవి.. వాళ్లపై కంప్లయింట్
Send us your feedback to audioarticles@vaarta.com
యాంకర్‌గా బుల్లితెరపై ఆకట్టుకోవడంతో పాటు ఫంక్షన్లకు హోస్ట్‌గా జనంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రవి. ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్నాడు. అయితే వెండి తెరపై ఆశించిన గుర్తింపు రాలేదు. తెలుగు రాష్ట్రాల్లో తనకున్న పాపులారిటీతో బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్‌గా ఆఫర్ అందుకున్నాడు. టైటిల్ విజేతల్లో ఒకరిగా ప్రచారం జరిగినప్పటికీ.. అనుకోని పరిస్ధితుల్లో హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడంతో అభిమానులు షాకయ్యారు. ఇదిలా ఉంటే రవి తాజాగా పోలీసులను అశ్రయించినట్టుగా తెలుస్తుంది. తనపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన పైనే కాకుండా తన కుటుంబ సభ్యులపై అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారని రవి చెప్పారు. తనపై ఎన్ని రకాల కామెంట్స్ చేసినా పట్టించుకోని రవి.. తన కుటుంబసభ్యుల గురించి అసభ్యకరంగా కామెంట్స్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో తనను ఉద్దేశించి చేసిన ప్రతి బ్యాడ్ కామెంట్‌కు సమాధానం చెప్పాల్సిందే అని రవి అంటున్నారు. ఇక బిగ్‌బాస్ కారణంగా దాదాపు రెండు నెలల పాటు కుటుంబానికి దూరంగా వున్న రవి.. తర్వాత హాలిడే ట్రిప్‌కి వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చాడు. ప్రస్తుతం ఆయన బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న టాప్ 5లో శ్రీరామ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నాడు. అయితే ఓటింగ్ సరళి చూస్తే మాత్రం ఇప్పుడు అందరికంటే ముందంజలో సన్నీ వుండగా.. ఆ తరువాత షన్ను రెండో స్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రైవేట్ పోల్స్, సర్వేలు, సోషల్ మీడియాలోని చర్చను చూస్తుంటే గ్రాండ్ ఫినాలే పోటాపోటీగా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout