45 లక్షల మోసం.. యాంకర్ రవి కంప్లైంట్
Send us your feedback to audioarticles@vaarta.com
బుల్లి తెరపై షోస్ ద్వారా పాపులర్ అయిన యాంకర్ రవి ఇది మా ప్రేమకథ అనే చిత్రంలోనూ నటించారు. బుల్లితెరపై పాపులర్ అయిన రవి ఎందుకనో వెండితెరపై సక్సెస్ కాలేకపోయాడు. అయినా కూడా తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నాడు. అయితే రవికి ఓ వ్యక్తి ఫైనాన్సియల్‌గా షాకిచ్చాడు విషయమేమంటే .. సందీప్ అనే వ్యక్తి ఓ సినిమా కోసం తన వద్ద 45 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడని, అడుగుతుంటే ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వివరాల్లోకెళ్తే ఓ సినిమా డిస్ట్రిబ్యూషన్ కోసమని సందీప్ అనే వ్యక్తికి రవి రూ.45 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అడిగితే కొంత మొత్తం మాత్రమే ఇచ్చాడు. మిగిలిన డబ్బులు ఇవ్వడం లేదట. గట్టిగా అడిగితే మనుషులను పెట్టి బెదిరిస్తున్నాడని యాంకర్ రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది వరకు సదరు సందీప్ అనే వ్యక్తి మరికొంత మంది దగ్గర డబ్బులు తీసుకుని ఇవ్వకుండా మోసం చేశాడని, కాబట్టి ఆయనపై పోలీసులు యాక్షన్ తీసుకోవాలని కోరాడు. రవి ఫిర్యాదు మేరకు కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout