Rashmi Gautam : స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ ఇంట్లో విషాదం.. ఎమోషనల్ పోస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ (Anchor Rashmi Gautam)ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె గ్రాండ్ మదర్ ప్రమీలా మిశ్రా కన్నుమూశారు. ఈ మేరకు రష్మీ గౌతమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా చిన్నప్పటి నుంచి తన అమ్మమ్మతో వున్న అనుబంధాన్ని ఆమె పంచుకున్నారు. ఆమె ఎంతో స్ట్రాంగ్ అని.. మా కుటుంబంపై ఆమె ప్రభావం ఎంతో వుందని, ఆమె దూరమైనా తన జ్ఞాపకాలు మాత్రం మాతోనే వుంటాయని రష్మీ రాసుకొచ్చారు.
జబర్దస్త్‌తో స్టార్ డమ్:
ఇక... తెలుగు టెలివిజన్ తెరపై వున్న స్టార్ యాంకర్లలో రష్మీ గౌతమ్ (Rashmi Gautam) ఒకరు. ఈటీవీలో ప్రసారమయ్యే బిగ్‌బాస్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తూ రష్మీ తెలుగు లోగిళ్లకు దగ్గరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన పాపులారిటీతోనే టీవీ షోలు, ఈవెంట్స్, ఓపెనింగ్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ వాటి ద్వారా రష్మీ ఇప్పుడు ఫుల్ బిజీ. అప్పుడప్పుడు వెండితెరపైనా మెరుస్తూ.. తనకొచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఖాళీ దొరికితే సన్నిహితులు, మిత్రులతో కలిసి ఏదైనా వెకేషన్‌కి వెళ్లడం రష్మీకి అలవాటు.
వెండితెర, బుల్లితెరపై రాణిస్తోన్న రష్మీ :
రష్మీ గౌతమ్ విశాఖలో జన్మించారు.ఆమె తండ్రి ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. తెలుగు, హిందీ, ఒడియా, ఇంగ్లీష్ భాషల్లో రష్మీ అనర్గళంగా మాట్లాడగలదు. దాదాపు ఇరవై ఏళ్ల నుంచి ఆమె సినీ ఇండస్ట్రీలో వుంటున్నారు. జబర్దస్త్‌తో స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న ఈ అమ్మడు.. గుంటూరు టాకీస్, అంతం, నెక్ట్స్ నువ్వే, అంతకుమించి, ప్రస్థానం వంటి చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం రష్మీ గౌతమ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments