Rashmi Gautam : నడి సముద్రంలో నీలి రంగు బికినీలో.. రష్మీ అందాల ప్రదర్శన, ఫోటోలు వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లు వుండగా.. ఒకరిద్దరు మాత్రమే స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నారు. అందులో ఒకరు రష్మీ గౌతమ్. కెరీర్ తొలి నాళ్లలో సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసినా ఆమెకు అంతగా కలిసిరాలేదు. ఈ క్రమంలో ఈటీవీలో ప్రసారమయ్యే బిగ్‌బాస్ షోకి హోస్ట్‌గా చేసే ఛాన్స్ రావడంతో రష్మీ దశ తిరిగిపోయింది. ఈ దెబ్బతో టీవీ షోలు, ఈవెంట్స్, ఓపెనింగ్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ వాటి ద్వారా రష్మీ ఇప్పుడు ఫుల్ బిజీ. అప్పుడప్పుడు వెండితెరపైనా మెరుస్తూ.. తనకొచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది.
మాల్దీవుల్లో రచ్చ చేస్తోన్న రష్మీ :
సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా వుండే రష్మీ.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సంగతులను పంచుకుంటూ వంటారు. అలాగే తన హాట్ ఫోటోలు, వీడియోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తూ వుంటారు. ఇటీవల మరో యాంకర్ దీపికా పిల్లితో పాటు పలువురు స్నేహితులతో కలిసి మాల్దీవ్స్ టూర్‌కి వెళ్లింది రష్మీ. ఈ సందర్భంగా రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఆమె పూర్తిగా హద్దులు దాటేసిందా అన్నట్లుగా వున్నాయి. షర్ట్ బటన్స్ విప్పేసి.. లోపలి బ్రా కనిపించేలా అందాల్ని అరబోసింది. అంతేకాదు ప్యాంట్ కూడా లేకుండా కేవలం షర్ట్‌తో మాత్రమే వుంది.
బుల్లి విమానాన్ని చూపెడుతూ... అందాల విందు:
ఈ వేడి చల్లారకముందే తాజాగా మరోసారి బీచ్‌లో, బోటు మీద రచ్చ చేసింది రష్మీ. పడవపై సముద్రంలో విహరిస్తూ స్కై బ్లూ కలర్ బికినీలో అందాలు అరబోస్తూ... మరోవైపు తన ముందు వెళ్తున్న బుల్లి విమానాన్ని చేతితో ఎవరికో చూపిస్తూ మురిసిపోతోంది. ప్రస్తుతం రష్మీ షేర్ చేసిన ఫోటోలు హాట్ టాపిక్‌గా మారాయి. మాల్దీవుల నుంచి ఇంకా హైదరాబాద్‌కు వచ్చారో లేదో తెలియదు కానీ, వచ్చే రెండు మూడు రోజుల్లో రష్మీ నుంచి మరిన్ని హాట్ ఫోటోలు వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com