నన్ను కావాలని ఈ వివాదంలోకి లాగుతున్నారు: యాంకర్ ప్రదీప్
Send us your feedback to audioarticles@vaarta.com
తనపై దాదాపు 150 మంది లైంగిక దాడి జరిపారంటూ ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది. పంజాగుట్ట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. అయితే వీరిలో ప్రముఖ యాంకర్ ప్రదీప్ పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. దీంతో యూట్యూబ్ ఛానల్స్‌తో పాటు సోషల్ మీడియాలో యాంకర్ ప్రదీప్‌పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఈ ట్రోలింగ్‌పై ప్రదీప్ తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనపై, తన కుటుంబంపై మానసిక అత్యాచారానికి పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ‘ద ట్రూత్’ ఓ వీడియోను విడుదల చేశాడు.
‘‘గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో నా మీద వస్తున్న ఆరోపణలు ఎంతో బాధాకరం. నిజానిజాలు తెలుసుకోకుండా నా ఫొటోలు వాడుతూ, నా మీద ఆర్టికల్స్ పబ్లిష్ చేయడం ఎంత దారుణమైనది. చాలా సున్నితమైన వివాదంలోకి నన్ను ఎందుకు లాగారో ఆలోచించడం లేదు. అసలు ఎవరు.. ఎందుకు లాగారో కూడా పట్టించుకోవడం లేదు. ఉద్దేశపూర్వకంగానే అటాక్ చేస్తున్నారు. అవతలి వ్యక్తులు నా పేరు ఎందుకు పెట్టారో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదేనా న్యాయం కోసం చేసే పోరాటం? ఒక వ్యక్తికి న్యాయం చేయడం కోసం ఇంకో వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తారా? నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది కదా.. వ్యూస్ కోసం నన్ను టార్గెట్ చేస్తున్నారు. వ్యూస్ ఎందుకు పనికొస్తాయి? నిజానిజాలు బయటకు వస్తాయి కదా.. అప్పటి వరకూ ఆగకుండా నన్ను, నా కుటుంబాన్ని మానసిక అత్యాచారం చేస్తున్నారు. సోషల్ మీడియా ఉన్నది ఒక గుడ్ కాజ్ కోసం.. ఇలానా.. వాడుతున్నది?
ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎదిగిన నన్ను కావాలని వివాదంలోకి లాగుతున్నారు. దీని వెనుక ఎవరున్నారో అందరినీ బయటకు లాగుతా. కానీ అప్పటి వరకూ ఆగాలి కదా.. వాళ్లకి ఒక కుటుంబం ఉంటుంది మనకూ ఒక కుటుంబం ఉంటుంది. అనవసరమైన ఆరోపణలతో నా సన్నిహతులు, అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నాకు తోచినంత వరకూ నేను ఎవరికైనా సహాయం చేస్తాను కానీ ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదు. ఇంతకు ముందు కూడా సోషల్ మీడియాలో నా పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి చాలా మందిని ఇబ్బంది పెట్టారు. గతంలో కూడా ఇలా నాపై ఎన్నో ట్రోల్స్ చేశారు. ఫేక్ అని తెలిశాక ఎవరైనా వచ్చి తప్పైందని అంటున్నారా? ఇది చాలా డెలికేట్ విషయం. నన్ను అభిమానించిన వారి కోసం నేను ఈ వీడియో చేస్తున్నారు. ఈ వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇందులో ఏమాత్రం నిజం లేదు. నిజానిజాలు ఖచ్చితంగా బయటకు రావాలి. సోషల్ మీడియాలో నాపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా. ప్లీజ్ దయచేసి సోషల్ ట్రోలింగ్‌ను ఆపండి’’ అని ప్రదీప్ పేర్కొన్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments