ఏపీ రాజకీయ వివాదంలో యాంకర్ ప్రదీప్.. బహిరంగ క్షమాపణకు డిమాండ్
Send us your feedback to audioarticles@vaarta.com
యాంకర్ ప్రదీప్ తెలుగులో స్టార్ యాంకర్ గా రాణిస్తున్నాడు. బుల్లితెర షోలలో, సినిమా ఈవెంట్స్ లో ప్రదీప్ చేసే సందడి అంతా ఇంతా కాదు. అప్పుడప్పుడూ నటుడిగా కూడా మెరుస్తున్నాడు. ప్రదీప్ హీరోగా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
అయితే ప్రదీప్ అప్పుడప్పుడూ వివాదాల్లో కూడా నిలుస్తుంటాడు. కొంత కాలం క్రితం ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో పోలీసులు ప్రదీప్ కు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. తాజాగా ప్రదీప్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఈ ప్రభావంతో ప్రదీప్ సీరియస్ గా వార్నింగ్స్ ఎదుర్కొంటున్నాడు.
ఇదీ చదవండి: సూపర్ స్టార్ ని కలిసిన మంచు విష్ణు.. 'మా' ఎన్నికల్లో పోటీ!
అసలు విషయం ఏంటంటే.. ప్రదీప్ ఓ టివి షోలో ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్నం అని కామెంట్ చేశాడు. టివి షోలో భాగంగా ఓ సందర్భంలో ప్రదీప్ ఎపి రాజధాని విశాఖ అని చెప్పాడు. ఇప్పుడిదే వివాదంగా మారింది. ప్రముఖ టివి ఛానల్ లో జరిగే అవార్డుల వేడుకకు ప్రదీప్ యాంకరింగ్ చేశాడు. ఆ సమయంలో ప్రదీప్ నోటి నుంచి ఈ మాట వచ్చింది.
ప్రదీప్ వ్యాఖ్యలపై అమరావతి పరిరక్షణ సమితి వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో ఉన్న అంశంపై ప్రదీప్ ఎలా కామెంట్స్ చేస్తారు అని పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికలపూడి శ్రీనివాసరావు మండిపడ్డారు. ప్రదీప్ తన వ్యాఖలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి.. లేకుంటే అతడి ఇంటిని ముట్టడిస్తాం అని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల వ్యవహారంపై వివాదం కొనసాగుతోంది. జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతితో పాటు విశాఖ, కర్నూల్ కూడా ఏపీ రాజధానులుగా కొనసాగుతాయని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com