అనారోగ్యంపై స్పందించి.. క్లారిటీ ఇచ్చుకున్న యాంకర్ ప్రదీప్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ టాప్ యాంకర్లలో ఒకరైన ప్రదీప్.. గత కొన్నిరోజులుగా స్క్రీన్‌పై కనపించకపోవడంతో అసలేం జరిగింది..? ఇంతకీ ఆయన ఏమయ్యారు..? ఆయనకు ఏమైంది..? అని పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. అంతేకాదు ప్రదీప్ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నారని కొందరు.. అవును ప్రదీప్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని మరికొందరు.. అబ్బే అదేం లేదు.. జస్ట్ కాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడని ఇంకొందరు ఇలా ఇష్టానుసారం కథనాలు రాసేశారు. ఇవన్నీ అటుంచితే ఓ లేడీ యాంకర్ విషయంలో ప్రదీపక్ అడ్రస్ లేకుండా పోయాడని కూడా ఆఖరికి పుకార్లు పుట్టాయి. దీంతో ఓ వైపు పుకార్లు ఎక్కువవుతుండటం.. మరోవైపు సన్నిహితులు, కుటుంబ సభ్యుల నుంచి స్పందించాలంటూ ఒత్తిడి ఎక్కువవుతుండటంతో ఎట్టకేలకు స్పందించి క్లారిటీ ఇచ్చుకున్నాడు ప్రదీప్.
ఇదీ అసలు కథ..!
‘కొన్నిరోజుల క్రితం నా కాలికి గాయం అయింది. ఎక్కువ సేపు నిలబడొద్దని డాక్టర్లు చెప్పినా కొన్ని షోలు చేశాను. దీంతో నొప్పి ఎక్కువ కావడంతో తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అంతకుమించి మరే అనారోగ్యం లేదు. కొన్ని రోజులుగా షూటింగ్స్‌లో పాల్గొనలేదు. ఈ కారణంగానే నాకు ఏదో అయిందంటూ వదంతులు పుట్టుకొచ్చాయి. నేను నిజంగానే తీవ్ర అనారోగ్యం పాలయ్యానేమో..? అని చాలామంది సన్నిహితులు ఆందోళన చెందారు. చాలా మంది ఫోన్ చేసి ఏమైంది..? ఏమైంది..? అని అడుగుతున్నారు. నా కోసం అంతమంది స్పందిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. మరో వారం రోజుల్లో షూటింగ్‌కు హాజరవుతాను’ అని ప్రదీప్ చెప్పుకొచ్చాడు. సో.. ఇకనైన ప్రదీప్ ఆరోగ్యంపై పుకార్లు ఆగుతాయో లేకుంటే మరింత పెరుగుతాయో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com