Anchor Lasya:పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన యాంకర్ లాస్య .. వెరైటీగా రివీల్
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ నటి, ప్రముఖ యాంకర్ లాస్య తన అభిమానులకు శుభవార్త చెప్పారు. ఆమె బుధవారం పండంటి మగబిడ్డకు జన్మనించ్చారు. ఈ విషయాన్ని లాస్య ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. రంగుల పండుగ హోలీ కానుకగా తమ ఇంట్లోకి కొత్త సభ్యుడు అడుగుపెట్టాడంటూ లాస్య దంపతులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ మేరకు చేతులుకు రంగులు అద్దుకుని ‘‘ఇట్స్ ఏ బేబీ బాయ్’’ అంటూ లాస్య ఓ వీడియోను షేర్ చేసింది. దీంతో నెటిజన్లు, పలువురు ప్రముఖులు లాస్యకు అభినందనలు తెలియజేస్తున్నారు.
స్కిన్ షోకు దూరంగా వుండే లాస్య:
ఇకపోతే.. తెలుగు నాట ఎంతోమంది యాంకర్స్ వున్నప్పటికీ లాస్య మాత్రం వారందరికీ భిన్నం. స్కిన్ షోకు దూరంగా వుండే ఈమె తన హద్దుల్లో తాను వుంటారు. చీమ ఏనుగు జోక్స్‌తో బాగా పాపులర్ అయ్యారు. ఇక ఆ తర్వాత యాంకర్ రవి- లాస్యలు కలిసి చేసిన షోలు బాగా హిట్ అయ్యాయి. దీంతో వీరిద్దరి మధ్యా ఏదో ఉందనే వరకు విషయం వెళ్లింది. అయితే తాము మంచి స్నేహితులం మాత్రమేనని, తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని వారు చెప్పేశారు. తర్వాత మంజునాథ్ అనే వ్యక్తితో తాను లవ్‌లో వున్నట్లు చెప్పి లాస్య షాకిచ్చారు. అనంతరం 2017 , ఫిబ్రవరి 15న హైదరాబాద్‌లో ముంజునాథ్-లాస్యల వివాహం జరిగింది. ఈ దంపతులకు 2019లో ఓ మగబిడ్డ జన్మించాడు. ఇతనికి దక్ష్ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో 2022 అక్టోబర్‌లో లాస్య మరోసారి గర్భం దాల్చారు.
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన వైష్ణవి:
మరోవైపు బుల్లితెర నటి వైష్ణవి కూడా పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె సోదరుడు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. సీరియల్స్‌లో బిజీగా వున్న సమయంలోనే వైష్ణవి .. సురేష్ అనే వ్యక్తిని పెళ్లాడారు. వివాహం తర్వాత ఆమె నటనకు గుడ్ బై చెప్పేశారు. అయితే సోషల్ మీడియా ద్వారా నిరంతరం అభిమానులతో టచ్‌లో వుంటున్నారు. ఈ క్రమంలోనే గతేడాది సెప్టెంబర్‌లో తాను గర్భం దాల్చినట్లు చెప్పింది. వైష్ణవికి సీమంతం కూడా ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఇప్పుడు పండంటి మగబిడ్డకు ఆమె జన్మనివ్వడంతో వైష్ణవి కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments