రిపబ్లిక్ డే : వివాదంలో అనసూయ.. 'అరే ఏందిరా బై మీ లొల్లి..' అంటూ రెచ్చిపోయిన రంగమ్మత్త
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ యాంకర్, సినీ నటి అనసూయ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. ఇందుకు కారణం ఏంటీ..? ఆమె ఎందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందో ఒకసారి చూస్తే.. ఈవెంట్లు, సినిమాలు, షూటింగ్‌లతో బిజీగా వున్నప్పటికీ సామాజిక మాధ్యమాల్లో అనసూయ యాక్టీవ్‌గా వుంటారు. తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాలకు సంబంధించిన వివరాలను ఆమె అభిమానులతో పంచుకుంటూ వుంటారు. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డేను పురస్కరించుకుని బుధవారం ఉదయం దేశప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘వందేమాతరం’ ఆలపిస్తూ ఓ వీడియోను షేర్ చేసి.. రిపబ్లిక్ డే విషెస్ చెప్పారు అనసూయ.
ఆ వీడియో చూసిన నెటిజన్లు భగ్గుమన్నారు. వందేమాతరం పాడేటప్పుడు ఎందుకు నిల్చోలేదంటూ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు టీ షర్ట్ పై గాందీ బొమ్మ ఎందుకు ధరించారంటూ మండిపడుతున్నారు. ఇలా చెప్పినందుకు మీరు ఫీలై ఉంటే క్షమించండి’’ అని నెటిజన్ల నుంచి వరుసగా కామెంట్లు వచ్చాయి.
ఆ కామెంట్లపై స్పందించిన అనసూయ..మీరు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను నిల్చొని వందేమాతరం ఆలపించనందుకు చాలామంది అసహనానికి లోనైనట్లు ఉన్నారు. అందుకు నన్ను క్షమించండి అంటూ పోస్ట్ చేశారు. జాతీయ గీతమైన ‘జనగణమన’కు లేచి నిలబడతాం.. తద్వారా దేశంపట్ల మన గౌరవాన్ని చాటుతాం. కానీ, నేను పాడింది జాతీయ గేయమైన వందేమాతరం.. అన్న సంగతిని మీరందరూ గమనించాలి. నా దేశం పట్ల నాకెంతో గౌరవం ఉంది’’ అని అనసూయ బదులిచ్చారు.
ఈ వివరణకు సంతృప్తి చెందని కొందరు నెటిజన్లు అదే పనిగా ట్రోలింగ్ చేస్తుండటంతో అనసూయ అసహనానికి గురయ్యారు. ‘‘అరేయ్ ఎందిరా భయ్ మీ లొల్లి.. జాతీయ గేయం అంటారు.. గాంధీకి రాజ్యాంగానికి సంబంధం ఏంటి? అంటారు.. వందేమాతరాన్ని జాతీయ గీతం అనుకుంటే మరి జనగణమన ఏంది? ఆగస్టు 15, 1947 స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టే.. జనవరి 26, 1950లో గణతంత్ర దినోత్సవం వచ్చింది. అందుచేత కాస్త బుర్ర అద్దెకు తెచ్చుకుని మాట్లాడండి’’ అని రంగమ్మత్త ఘాటుగా బదులిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com