‘‘నా వయసు 36 .. 40 కాదు’’ ... కాస్త తెలుసుకుని వార్తలు రాయి : విలేకరికి అనసూయ వార్నింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
ముఖంపై చిరునవ్వుతో ఎప్పుడూ హుషారుగా కనిపించే స్టార్ యాంకర్, సినీ నటి అనసూయ భరద్వాజ్ ఫైర్ అయ్యారు. ఏకంగా మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. తన గురించి తప్పుడు వార్తలు రాస్తే మామూలుగా వుండదని హెచ్చరించారు. ఇందుకు కారణం లేకపోలేదు. యాంకరింగ్, ఈవెంట్లతో పాటు సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ క్షణం తీరిక లేకుండా వుంటున్నారు అనసూయ. అయితే సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలు.. సినిమాలకు సంబంధించిన సంగతులను అభిమానులతో పంచుకుంటూ వుంటారామె. వీటిలో హాట్ ఫోటో షూట్లు సైతం వుంటాయి. ఇటీవల వైట్ శారీలో దేవకన్యలా మెరిసిపోతూ వున్న ఫోటోలను ఆమె షేర్ చేశారు. దీనిపై ఓ విలేకరి అనసూయ అందాన్ని మెచ్చుకుంటూనే.. ఆమె వయసు 40 అంటూ రాశారు. దీంతో అనసూయకు చిర్రెత్తుకొచ్చింది.
వెంటనే ఆ స్టోరిని షేర్ చేస్తూ... సదరు విలేకరికి గట్టి కౌంటరిచ్చారు. నా వయసు 40 కాదు 36. వయసు పెరగడం అనేది సర్వసాధారణం. నా వయసుని చెప్పుకోవడానికి తాను సిగ్గుపడటం లేదని.. కాబట్టి మీరు వార్తలు రాసేటప్పుడు కచ్చితమైన వివరాలను పద్ధతిగా ఇస్తే బాగుంటుందని అనసూయ ముక్కుసూటిగా చెప్పారు. విషయాన్ని కాస్త మర్యాదపూర్వకంగా చెబితే బాగుంటుందని.. ఎందుకంటే జర్నలిజం అనేది ఒక ఆయుధమని.. దాన్ని మనం చక్కగా నిర్వహించకపోతే ఎదురుదెబ్బలు తగులుతాయి అని ఆమె హెచ్చరించారు.
ఈ ట్వీట్‌పై స్పందించిన ఓ నెటిజన్.. ఆమెను మెచ్చుకుంటూ కామెంట్ పెట్టగా, దానిపై అనసూయ స్పందించారు. వార్తల్లో వచ్చేవి వాస్తవాలో లేదా అవాస్తవాలో అందరికి ఎలా తెలుస్తుంది. ఎవరో ఒకరు స్పందించినప్పుడే ఇలాంటివి మళ్లీ జరగకుండా వుంటాయని ఆమె చెప్పారు. నటీనటులమైనా మేమూ మనుషులమే ... మాకూ భావోద్వేగాలుంటాయి అని రంగమ్మత్త పేర్కొన్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. అనసూయ ఇప్పటికే అల్లు అర్జున్ నటించిన పుష్పలో ద్రాక్షాయణీగా వైరల్‌గా కనిపించారు. రవితేజ నటించిన ఖిలాడీలో ‘‘చంద్రకళ’’గా మెప్పించారు. ప్రస్తుతం ఆమె మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com