Anasuya Bharadwaj:ఆయనతో ప్రేమలో పడిపోయా, కైకాల ఇకలేరంటే... అనసూయ ఎమోషనల్ పోస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చిత్ర పరిశ్రమలోని దిగ్గజ నటుల్లో ఒకరైన కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) మరణంతో టాలీవుడ్ విషాదంలో కూరుకుపోయింది. నవరసాలను అద్భుతంగా పండించగల అరుదైన నటుల్లో కైకాల ఒకరు. ఎస్వీ రంగారావు తర్వాత ఆ స్థాయిలో తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్యనారాయణే. 60 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో దాదాపు 770కి పైగా సినిమాల్లో నటించి నవరస నటనా సార్వభౌమగా నిలిచిన కైకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటే. ఆయన మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ యాంకర్, సినీ నటి అనసూయ (Anasuya Bharadwaj) కైకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు చెబుతూ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ఉదయాన్నే కైకాల మరణవార్త విన్నా :
‘‘ ఉదయాన్ని కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana)గారి మరణవార్త వినడం చాలా బాధగా వుంది. తన చిన్నతనంలో నా ఫేవరేట్ యాక్టర్ ఆయనే. ‘‘ఘటోత్కచుడు’’లో కైకాలని చూసి ఆయనతో ప్రేమలో పడిపోయా. ఆయన బహుముఖ ప్రజ్ఞ, టాలీవుడ్‌కి అందించిన అపారమైన సేవలు సత్యనారాయణను ఎప్పుడూ గుర్తుంచుకునేలా చేస్తాయి’’ అని అనసూయ (Anchor Anasuya) ట్వీట్ చేశారు.
కైకాలకు యముడిలా పేరు తెచ్చిన ఘటోత్కచుడి క్యారెక్టర్ :
ఇదిలావుండగా .. యముడి పాత్రలకు కేరాఫ్‌గా నిలిచిన కైకాల సత్యనారాయణ కెరీర్‌లో మరో గుర్తుండిపోయే పాత్ర ఘటోత్కచుడు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కైకాల అదరగొట్టేశారు. ఈ సినిమాకు ఆయనే హీరో. ముఖ్యంగా రోబో, కైకాల మధ్య వచ్చే సీన్లు అప్పటి తరాన్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని ‘‘అందాల అపరంజి బొమ్మ’’ అంటూ చిన్నారికి కైకాల గోరుముద్దలు తినిపిస్తూ పాడే పాట ఇప్పటికీ ఎంతో మందికి ఫేవరేట్.
Deeply saddened waking up to the news of Kaikala Satyanarayana garu’s demise..He was my most favourite actor as I was growing up..fell in love with him in and as Ghatotkachudu❤️He will always be remembered for his versatility and his enormous contribution towards TFI..Om Shanti???? pic.twitter.com/h88N2WgQMQ
— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 23, 2022
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments