Anasuya Bharadwaj: పెళ్లి రోజున భర్తతో కలిసి థాయ్ బీచ్‌లో రంగమ్మత్త.. వైట్ బికినీలో మామూలగా లేదుగా
Send us your feedback to audioarticles@vaarta.com
న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టి.. యాంకర్‌గా, నటిగా ఎదిగారు అనసూయ భరద్వాజ్. తెలుగులో డిమాండ్ వున్న నటీమణుల్లో ఆమె కూడా ఒకరు. అందంతో పాటు అభినయం కలగలిసి వుండటంతో అనసూయకు లక్షలాది మంది అభిమానులు వున్నారు. ఇక మనసులో ఏమున్నా ముఖం మీద కొట్టినట్లు మాట్లాడటం ఆమె స్టైల్. అందుకే అనసూయ వివాదాలతోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో అవకాశాలు రావడంతో బుల్లితెరకు గుడ్‌బై చెప్పిన ఆమె పూర్తిగా చిత్ర రంగానికే సమయం కేటాయిస్తున్నారు. ఇక ఈవెంట్స్, ఓపెనింగ్స్‌తో రంగమ్మత్త ఫుల్ బిజీ. మధ్య మధ్యలో హాట్ హాట్ ఫోటలతో సెగలు రేపుతోంది. పెళ్లయి , ఇద్దరు పిల్లలున్నా చెక్కు చెదరని అందంతో కుర్రకారుకు గిలిగింతలు పెడుతోంది. అయితే ఇటీవలి కాలంలో అనసూయ గ్లామర్ డోస్ పెంచేసింది. మొన్నామధ్య స్విమ్మింగ్ పూల్‌లో బికినీతో హల్చల్ చేసింది. ఇక ఫ్యామిలీతో వేకేషన్‌కు వెళ్లినప్పుడు కూడా వాటికి సంబంధించిన ఫోటోలను ఆమె ఖచ్చితంగా షేర్ చేస్తారు.
థాయ్‌లాండ్ బీచ్‌ల్లో అనసూయ వేకేషన్ :
తాజాగా మరోసారి హాఫ్ బికినీతో బీచ్ ఒడ్డున హాట్ హాట్ ఫోటోలు ఇచ్చింది అనసూయ. సమ్మర్ కావడంతో భర్త సుశాంక్ భరద్వాజ్ పిల్లలతో కలిసి థాయ్‌లాండ్ టూర్‌కి వెళ్లి ఎంజాయ్ చేస్తోంది. షార్ట్ వేర్‌తో బ్యాంకాక్ వీధుల్లో తిరుగుతూ షాపింగ్ చేస్తున్నారు అనసూయ వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే.. ఈరోజు అనసూయ, సుశాంక్ దంపతుల పెళ్లి రోజు. ఈ సందర్భంగా థాయ్ బీచ్‌లో భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోలు, ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు.. ఓ భారీ నోట్‌ను కూడా పంచుకున్నారు.
మనం పర్ఫెక్ట్ కపుల్ కాదు :
‘‘2001 జనవరి 23న న్యూఢిల్లీలోని ఆడిటోరియంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరైనప్పుడు నువ్వు నాకు రాసిన తొలి ప్రేమ లేఖ నాకింకా గుర్తే. అప్పుడు నీకు నేను జవాబు రాయలేదు. కానీ ఇప్పుడు రాయడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రియమైన నిక్కు.. ఇన్నాళ్లు నాతో జీవితాన్ని పంచుకోవడం మాత్రమే కాకుండా , నువ్వు చేసిన వెలకట్టలేని త్యాగాలకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. నన్ను నాలా ఉండనిచ్చినందుకు కొందరు నిన్ను నీచమైన మాటలు అననా.. వాటిని పట్టించుకోకుండా , మన ప్రేమ మందిరం చెక్కు చెదరకుండా ఓ పిల్లర్‌లాగా నిలబడ్డావు. ఇప్పుడు ఇద్దరం కలిసి ఎదుగుతున్నాం. కొన్నిసార్లు నన్ను నువ్వు ఎలా భరిస్తున్నావోనని ఆశ్చర్యంగా వుంటుంది. అయితే మరి నేను కూడా నిన్ను భరిస్తున్నా కదా. మనిద్దరం ఒకే జాతి మనుషులం. మిగిలిన జీవితంలోనూ నిన్ను హింసించే ఏకైక వ్యక్తిని నేనే . మనం పర్ఫెక్ట్ కపుల్ కాదని నాకు తెలుసు.. ఇద్దరం మూర్ఖులమే. అయినా ఒకరి కోసం ఒకరం నిలబడ్డాం.. ఈ స్థాయికి చేరుకున్నాం. మన వైవాహిక బంధాన్ని కొన్నాళ్ల పాటు డేటింగ్‌లా వుండేందుకు అనుమతించినందుకు ధన్యవాదాలు. మనం కలకాలం ఇలాగే కలిసి వుండాలి...హ్యాపీ యానివర్సరీ బేబ్.. ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే వుంటానంటూ’’ అనసూయ పేర్కొన్నారు
❤️ AB & SB ❤️#13YearsOfLove @anusuyakhasba @anusuyakhasba #Anasuya #AnasuyaBharadwaj pic.twitter.com/hlmPBm2jTJ
— Team Anasuya ♥ (@Anasuyakhasba) June 4, 2023
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com