మంచు ఫ్యామిలీ హీరోల చిత్రంలో అనసూయ

  • IndiaGlitz, [Saturday,July 22 2017]

జ‌బ‌ర్‌ద‌స్త్ షోతో యాంక‌ర్‌గా పాపులారిటీ సంపాదించుకుంది అన‌సూయ‌. బుల్లితెర నుండి ఇప్పుడు అన‌సూయ వెండితెర వైపు అడుగులేస్తుంది. సోగ్గాడే చిన్ని నాయనా, విన్న‌ర్ చిత్రాల్లో న‌టించిన అన‌సూయ ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న రంగ‌స్థ‌లం 1985లో న‌టిస్తుంది.
ఇప్పుడు వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం మంచు మోహ‌న్‌బాబు న‌టించ‌నున్న సినిమాలో అన‌సూయ కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌బోతుంద‌ట‌. ఈ సినిమాలో మంచు విష్ణు కూడా న‌టిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.