close
Choose your channels

నెటిజన్‌ కామెంట్‌కు దిమ్మదిరిగేలా 'రంగమ్మత్త' రిప్లయ్!

Monday, February 8, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నెటిజన్‌ కామెంట్‌కు దిమ్మదిరిగేలా ‘రంగమ్మత్త’ రిప్లయ్!

సినిమా సెలబ్రిటీలపై.. మరీ ముఖ్యంగా నటీమణులపై నిత్యం ఎవరో ఒకరు విమర్శించడం.. సోషల్ మీడియా వేదికగా అసభ్యంగా కామెంట్స్ చేయడం కొందరు నెటిజన్లకు షరామామూలైపోతోంది. అలా తిట్టిన వారిని కనిపెట్టి పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం.. లేదా ఆ నెటిజన్ అంతే రీతిలో ఘాటుగా రిప్లయ్ ఇవ్వడం సెలబ్రిటీలు కూడా అలవాటు చేసుకున్నారు. బహుశా నెటిజన్ల నుంచి దాదాపు అందరు నటీమణులు ఇలాంటి కామెంట్స్ ఎదుర్కొన్నారు. వీరిలో కొందరు అబ్బే.. అవేం మనకు పట్టవు అన్నట్లుగా లైట్ తీసుకుంటూ ఉంటారు. మరికొందరు మాత్రం దిమ్మదిరిగే బొమ్మ కనపడేలా.. మరోమారు ఇలాంటి కామెంట్స్ చేయాలంటేనే భయపడేలా రిప్లయ్‌లు ఇస్తుంటారు. తాజాగా.. బుల్లితెర యాంకర్, నటి అనసూయకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే తనను ఎవరైనా సరే అసభ్యంగా మాట్లాడితే అస్సలు ఓర్చుకోని ఈ భామ.. ఆ నెటిజన్‌కు స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చింది. ఇంతకీ ఆ కామెంట్ ఏంటి..? రంగమ్మత్త రిప్లయ్ ఏంటి..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం

అసలేం జరిగింది..!?

అసలు విషయానికొస్తే.. మూడేళ్ల క్రితం జరిగిన ఓ ఈవెంట్ షూటింగ్‌లో అనసూయ కళ్లు తిరిగిపడిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయ్యో పాపం అనసూయ అని కొందరు అప్పట్లో అనగా.. మరికొందరు మాత్రం విమర్శలు గుప్పించారు. అవన్నీ ఇప్పుడు అసందర్భం. అదంతా గతం గత:. ఇప్పుడు ఆ వీడియోలోని ఓ ఫొటోను తీసుకున్న నెటిజన్ ట్విటర్‌‌లో షేర్‌ చేస్తూ.. ‘ప్రచారం కోసమే అనసూయ ఇలా కళ్లు తిరిగిపడిపోయింది..’ అని కామెంట్ చేస్తూ ఓ అభ్యంతరకర పదాన్ని వాడాడు. అంతటితో ఆగని ఆ నెటిజన్ అనసూయను కూడా ట్యాగ్ చేశాడు. ఈ కామెంట్ చూసిన అనసూయకు చిర్రెత్తుకొచ్చింది. ‘నన్నే ఇంత మాట అంటావా’ అంటూ రంగమ్మత్త ఆ నెటిజన్‌కు ట్వీట్ రూపంలో గడ్డిపెట్టింది.

దిమ్మదిరిగేలా రిప్లయ్!

‘ఇతరులను నీలా నిందించడం చాలా సులభమే. ఇద్దరు పిల్లలకు తల్లినైన నాకు లో-బీపీ ఉంది. 22 గంటలపాటు గ్యాప్ లేకుండా షూట్‌లో పాల్గొన్నాను. దీంతో తెల్లవారుజామున 5:30 గంటలకు నాకు కళ్లు తిరిగిపడిపోయాను. అసలు ఏం జరిగింది..? ఎందుకలా జరిగింది..? అనేది పూర్తిగా తెలియకుండానే నాపై ఎలా కామెంట్‌ చేస్తావు మిస్టర్‌ ఆదిత్య?’ అంటూ ఆ నెటిజన్‌కు దిమ్మదిరిగేలా అనసూయ రిప్లై ఇచ్చింది. అంతటితో ఆగని అనసూయ మరో ట్వీట్ చేస్తూ.. తనను అసభ్యంగా దూషించాలనే ఉద్దేశంతోనే మూడేళ్ల క్రితం వీడియోను వెలికితీసి ఇలా కామెంట్‌ చేస్తున్నావా? అంటూ ఫైర్ అయ్యింది. నిన్ను కూడా అసభ్యంగా దూషించడానికి తనకు ఎలాంటి సిగ్గు, భయం లేదని.. ఎందుకంటే ముందు నువ్వు మొదలుపెట్టావ్ అని చెప్పుకొచ్చింది. అయితే ఇలా చేస్తున్నందుకు బాధగా ఉందని ఎందుకంటే తనను తల్లిదండ్రులు అలా పెంచలేదని అనసూయ కౌంటర్ ఎటాక్ చేసింది.

శభాష్ అత్తో..!

రంగమ్మత్త రిప్లయ్‌కు అభిమానులు, నెటిజన్లు ‘శభాష్ మేడమ్..’ అంటూ మెచ్చుకుంటున్నారు. చర్యకు కచ్చితంగా ప్రతిచర్య ఉంటుందన్నట్లుగా.. సోషల్ మీడియా ఉంది కదా అని ఇలా ఇష్టానుసారం కామెంట్స్ చేస్తే.. అంతే రీతిలోనే రిప్లయ్ ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత నాలుక్కరుచుకోవాల్సిన పరిస్థితే వస్తుంది. అంతేకాదు.. ఇలాంటి వ్యవహారాలు పోలీస్ స్టేషన్లు, కోర్టుల దాకా వెళితే ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుని కామెంట్స్ చేస్తే బాగుంటుందేమో.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment