రోజాపై అనసూయ సెటైర్.. నెట్టింట జోకులే జోకులు
Send us your feedback to audioarticles@vaarta.com
జబర్దస్త్ షోతో అనసూయ ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ అవకాశాలు కూడా వెతుక్కుంటూ వచ్చాయంటే.. ఆ షో వ్యాఖ్యాతగా చూపిన పెర్ఫార్మెన్సే కారణం. ప్రస్తుతం ఆమె ఓ ప్రముఖ ఛానల్‌లో ‘లోకల్ గ్యాంగ్స్’ షో చేస్తోంది. ప్రదీప్, శేఖర్ మాస్టర్ కూడా ఈ షోలో ఆమెతో పాటు చేస్తున్నారు. అయితే ఈ షోలో సీనియర్ పొలిటీషియన్, జబర్దస్త్ షో జడ్జి రోజాపై వేసిన సెటైర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
వివరాల్లోకి వెళితే.. ఈ షోలో అనసూయ, శేఖర్ మాస్టర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్‌పై ప్రదీప్ ఓ జోక్ వేశాడు. ఫోన్‌లో మాట్లాడుతున్నట్టు నటిస్తూ.. ‘‘హలో రోజా గారూ.. మా శేఖర్ మాస్టరా.. ఇంకెక్కడ శేఖర్ మేడమ్.. మీ శేఖర్ లేడింక. ఆయన అం..అః వరకు వెళ్లిపోయాడు.. ఈ తీవ్రమైన చర్చను ఎక్కడ చర్చిస్తారు మేడమ్ అంటూ ఉండగా.. అనసూయ మధ్యలో కల్పించుకుంది. బండిలో అని సెటైర్ వేసింది. దీంతో అక్కడంతా నవ్వులు పూశాయి. ఇంతకూ ఆవిడ యాంకిరింగా.. లేక పార్టీలోనా అని వ్యాఖ్యానించిది. ఆ వ్యాఖ్యలు ‘బతుకు జట్కా బండి’ని స్ఫూరించేలా ఉండటంతో అక్కడంతా అందరూ ఒక్కసారిగా గొళ్లుమన్నారు. రోజాను ఉద్దేశించి అనసూయ సెటైర్లు వేసిందంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. మొత్తానికి రోజా.. ఆమెకు కూడా లోకువైపోయిందా అంటున్నారు. ఈ ఎపిసోడ్ ఈ శనివారం టెలికాస్ట్ కానుంది. దానికి సంబంధించిన ప్రొమో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది. ఈ ప్రొమోలో శేఖర్ మాస్టర్, అనసూయలు డ్యాన్స్ ఇరగదీశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments