రోజాపై అనసూయ సెటైర్.. నెట్టింట జోకులే జోకులు

  • IndiaGlitz, [Saturday,January 18 2020]

జబర్దస్త్ షోతో అనసూయ ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ అవకాశాలు కూడా వెతుక్కుంటూ వచ్చాయంటే.. ఆ షో వ్యాఖ్యాతగా చూపిన పెర్ఫార్మెన్సే కారణం. ప్రస్తుతం ఆమె ఓ ప్రముఖ ఛానల్‌లో ‘లోకల్ గ్యాంగ్స్’ షో చేస్తోంది. ప్రదీప్, శేఖర్ మాస్టర్ కూడా ఈ షోలో ఆమెతో పాటు చేస్తున్నారు. అయితే ఈ షోలో సీనియర్ పొలిటీషియన్, జబర్దస్త్ షో జడ్జి రోజాపై వేసిన సెటైర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

వివరాల్లోకి వెళితే.. ఈ షోలో అనసూయ, శేఖర్ మాస్టర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్‌పై ప్రదీప్ ఓ జోక్ వేశాడు. ఫోన్‌లో మాట్లాడుతున్నట్టు నటిస్తూ.. ‘‘హలో రోజా గారూ.. మా శేఖర్ మాస్టరా.. ఇంకెక్కడ శేఖర్ మేడమ్.. మీ శేఖర్ లేడింక. ఆయన అం..అః వరకు వెళ్లిపోయాడు.. ఈ తీవ్రమైన చర్చను ఎక్కడ చర్చిస్తారు మేడమ్ అంటూ ఉండగా.. అనసూయ మధ్యలో కల్పించుకుంది. బండిలో అని సెటైర్ వేసింది. దీంతో అక్కడంతా నవ్వులు పూశాయి. ఇంతకూ ఆవిడ యాంకిరింగా.. లేక పార్టీలోనా అని వ్యాఖ్యానించిది. ఆ వ్యాఖ్యలు ‘బతుకు జట్కా బండి’ని స్ఫూరించేలా ఉండటంతో అక్కడంతా అందరూ ఒక్కసారిగా గొళ్లుమన్నారు. రోజాను ఉద్దేశించి అనసూయ సెటైర్లు వేసిందంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. మొత్తానికి రోజా.. ఆమెకు కూడా లోకువైపోయిందా అంటున్నారు. ఈ ఎపిసోడ్ ఈ శనివారం టెలికాస్ట్ కానుంది. దానికి సంబంధించిన ప్రొమో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది. ఈ ప్రొమోలో శేఖర్ మాస్టర్, అనసూయలు డ్యాన్స్ ఇరగదీశారు.

More News

నేనైతే ఆ పని చేయను.. దీపికపై కంగనా ఫైర్.!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనే, కంగనా రనౌత్ సినిమాలకే కాదు.. సామాజిక అంశాల్లోనూ చురుకుగా ఉంటారన్న విషయం తెలిసిందే.

పవన్ 'పింక్' రిలీజ్ ఖరారైందా?

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ సినిమా `పింక్‌`ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

బాలీవుడ్ ప్రాజెక్ట్ నుండి కీర్తి సురేష్ ఔట్‌!!

మ‌హానటితో ద‌క్షిణాదిలో హీరోయిన్ త‌నేంటో ప్రూవ్ చేసుకున్న కీర్తిసురేష్‌.. ఇప్పుడు హిందీలోకి `మైదాన్‌` సినిమాతో ఎంట్రీ ఇస్తున్నానని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

షూటింగ్ షురూ చేసిన ప్ర‌భాస్

బాహుబ‌లి సినిమాతో నేష‌న‌ల్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ త‌ర్వాత వ‌చ్చిన సాహోతో ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని మాత్రం అందుకోలేక‌పోయాడు.

ఎల్ వి ప్రసాద్ ధైర్యం చెప్పక పోయివుంటే నేను నటుడిగా నిలపడేవాణ్ణి కాదు - కృష్ణం రాజు

భారత చలనచిత్ర పితామహుడు, మూకీ యుగం నుండి డిజిటల్ మూవీస్ వరకు నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్బిటర్ గా, ఫిలిం ల్యాబ్ అధినేతగా భారత సినీ పరిశ్రమ మార్గదర్శకుడు ఎల్.ప్రసాద్,