పైట లేకుండా .. నోటిలో బ్లేడు పెట్టుకుని, టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా ‘‘అనసూయ’’ రోల్
Send us your feedback to audioarticles@vaarta.com
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న ‘‘పుష్ప’’ సినిమా ట్రైలర్ ఈ సోమవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్తదనం, వైవిధ్యం పరితపించే సుకుమార్ మార్క్ టేకింగ్ పుష్పలో కనిపించింది. అన్ని రకాల మాస్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను నింపేశాడు సుకుమార్. అల్లు అర్జున్, రష్మిక, ధనుంజయ్, సునీల్, అనసూయ, అజయ్ ఘోష్‌లను కొత్తగా చూపించాడు.
వీరిందరిలోకి చెప్పుకోవాల్సింది అనసూయ గురించే. యాంకరింగ్‌తో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు సుకుమార్ లైఫ్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. రంగస్థలంలో రంగమ్మత్తగా కనిపించి నటిగా ఓ మెట్టుపైకెక్కిన అనసూయ.. ఇప్పుడు పుష్పలో అంతకుమించి అనిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో దాక్షాయణిగా నెగిటివ్ షేడ్ వున్న పాత్ర చేస్తున్నారు అనసూయ. అమ్మోరు లాంటి పెద్ద బొట్టు, చేతికి ఉంగరాలు, మెడలో నగలు ధరించి ఓ పెద్దింటి మహిళగా ఆమె కనిపిస్తున్నారు.
నిన్న విడుదలైన ట్రైలర్లో అనసూయ ఉగ్ర స్వరూపం చూపించారు. ఈ టీజర్లో ఆమె క్యారెక్టర్ గురించి చిన్న హింట్ వదిలారు. ఈ లుక్‌లో పైన పైట కొంగు లేకుండా మంచం మీద ఓ వ్యక్తిపై కూర్చొని నోట్లో బ్లేడ్ పెట్టుకుని అతనిని కిరాతకంగా చంపుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు గ్లాయర్ డాల్‌గా కనిపించిన అనసూయ.. ఫస్ట్ టైమ్ అత్యంత క్రూరురాలిగా కనిపిస్తుండటంతో ‘‘పుష్ప’’పై అంచనాలను పెంచేస్తోంది. ఈ చిత్రంలో సునీల్ భార్యగా అనసూయ నటిస్తోందని.. ఆమె తన భర్తని చంపేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అనసూయ.. మంగళం శ్రీనుగా చెబుతున్న తన భర్తను ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది పుష్ప పార్ట్ 1లో ట్విస్ట్‌గా చెబుతున్నారు. మరి వీటికి క్లారిటీ రావాలంటే డిసెంబర్ 17 వరకు ఎదురుచూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments