ఆ బయోపిక్‌లో అనసూయ?
Send us your feedback to audioarticles@vaarta.com
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాద యాత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘యాత్ర’. వై.ఎస్.ఆర్గా ప్రధాన పాత్రలో మలయాళం మెగాస్టార్ మమ్మూట్టి నటిస్తున్నారు. మహి వి.రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని 70ఎం.ఎం. బ్యానర్‌పై విజయ్ చల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా నటించి విమర్శకుల ప్రశంసలు పొందిన టి.వి.యాంకర్ అనసూయ ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలి పాత్రలోఅనసూయ కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ కల్లా పూర్తిచేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేసింది. నవంబర్ నెలలోగానీ లేదా సంక్రాంతికి గానీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com