నితిన్ రీమేక్‌లో అనసూయ?
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు నితిన్.. ఏడాదిన్నర గ్యాప్ తర్వాత చేసిన `భీష్మ`తో బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ కొట్టాడు. ఈ గ్యాప్‌లో నితిన్ మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి రీమేక్ సినిమా. బాలీవుడ్లో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు నటించిన `అంధాదున్` సినిమా పెద్ద హిట్టైన సంగతి తెలిసిందే. దాని రీమేక్ హక్కులను నితిన్ దక్కించుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే సినిమా లాంఛనంగా సోమవారం ప్రారంభమవుతుంది. రెగ్యులర్ షూటింగ్‌కు కాస్త గ్యాప్ తీసుకుంటారు. కాగా.. ఈ సినిమాలో రాధికా ఆప్టే స్థానంలో ఎవరు నటిస్తారు? టబు స్థానంలో ఎవరు నటిస్తారు? అనే దానిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు.
సినీ వర్గాల సమాచారం మేరకు టటు స్థానంలో అనసూయ నటిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. ఈ మధ్య కాలంలో క్షణం, రంగస్థలం సినిమాలతో నటిగా తనెంటో ప్రూవ్ చేసుకున్న అనసూయ.. ఇప్పుడు మరో కీలక పాత్రలో నటించబోతుందట. ఈ సినిమాలో అనసూయ పాత్రకు చాలా గుర్తింపు ఉంటుంది. అలాగే నితిన్ అంధుడిగా నటించబోతున్నాడు. నితిన్ తన సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్‌పై ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. మరి హీరోయిన్గా ఎవరిని తీసుకుంటారనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com