ఇన్‌స్టాగ్రామ్‌లో అనసూయ హాట్ ఫొటో.. ఆడుకుంటున్న నెటిజన్లు
- IndiaGlitz, [Tuesday,May 07 2019]
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో మనుషులు మనకు దగ్గరవుతున్నారని ఎంతో సంతోషపడిపోతుంటాం.. ఎప్పుడో కాంటాక్ట్‌లో లేకుండా పోయిన ఫ్రెండ్స్ మళ్లీ సోషల్ మీడియా వేదికగా కలిశామని తెగ సంబరపడిపోతుంటాం. అయితే ఇదే సోషల్ మాధ్యమాలతో సెలబ్రిటీలు లేనిపోని కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు. నిత్యం ఈ మాధ్యమాల ద్వారా సెలబ్రిటీలు అభిమానులతో టచ్‌లో ఉంటూ తమ కార్యకలాపాలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌లో నూతనోత్సాహం నింపుతుంటారు. అలాంటి సెలబ్రిటీల్లో హాట్ యాంకర్, నటి అనసూయ కూడా ఒకరు. ఇదిగో ఈ ఫొటో చూశారుగా.. ఈ ఫొటో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు.
ఇక అసలు విషయానికొస్తే.. తన భర్తకు మసాజ్ చేస్తూ అనసూయ బిజీబిజీగా ఉంది. అను కుమారుడు ఆయాన్ష్ ఫోన్ తీసుకుని ఓ ఫొటో క్లిక్ మనిపించాడు. ఆ ఫొటోను అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కొన్ని కొన్ని ఫొటోలు స్టోరీలెన్నో చెబుతాయి.. ఇవాళ మధ్యాహ్నం నా కుమారుడు అయాన్ష్ ఈ ఫొటో తీశాడు. ఇలాంటి కుటుంబం ఉండటం నా అదృష్టం అని చాలా పెద్ద స్టోరీనే చెప్పుకొచ్చింది. ఇంత వరకూ ఓకే.. ఫ్యామిలీ కాబట్టి ఆమె ఇష్టం. అయితే ఆమె వేసుకున్న డ్రెస్‌పై అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోనీ కుమారుడు ఫొటో తీశాడే అనుకుందాం.. ఆ ఫొటో హాట్‌గా ఉందని తెలిసి మరీ మీరు సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేశారు.. అసలు మీరు ఇంట్లో ఉండే పిల్లల ముందే ఇలానేనా ఉండేది.. అంటూ నెటిజన్లు, అనసూయ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరికొందరు ఫ్యాన్స్ రాయలేని మాటల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా అనసూయకు ఇలాంటి పొట్టి డ్రెస్‌లు వేసుకుని హాట్ హాట్‌గా ఉండటం కొత్తేమీ కాదని.. హాట్‌గా లేకపోతే అవకాశాలు రావు కదా.. చాన్స్‌లు కోసమే ఈ భామ ఇలా అందాలు ఒలకబోస్తోందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సో.. ఫ్యామిలీ విషయాలు ఫ్యామిలీలోనే చూస్కోవాలి రోడ్డున పడి వాగితే బాగోదు కదా.. అదే విధంగా కొన్ని కొన్ని ఫొటోలు పోస్ట్ చేయకూడదు.. పోస్ట్ చేస్తే ఇలాగే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని విమర్శకులు చెబుతున్నారు.