'అనసూయ' కి 10 ఏళ్లు

  • IndiaGlitz, [Thursday,December 21 2017]

హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో రాణించిన క‌థానాయిక‌ల్లో భూమికా చావ్లా ఒక‌రు. 'మిస్స‌మ్మ‌'లో త‌న న‌ట‌న‌తో అల‌రించ‌డ‌మే కాకుండా.. నంది పుర‌స్కారాన్ని కూడా సొంతం చేసుకున్నారు భూమిక‌. 'మిస్స‌మ్మ' త‌రువాత మ‌ళ్లీ విమెన్ సెంట్రిక్ మూవీలో భూమిక మెప్పించిన చిత్రం 'అన‌సూయ‌'. వ‌రుస హ‌త్యల నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో.. జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో భూమిక న‌ట‌న ఆక‌ట్టుకునేలా ఉంటుంది.
ఇక ద‌ర్శ‌కుడు ర‌విబాబు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన విధానం.. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ప్ర‌థ‌మార్థం అంతా హ‌త్య‌ల నేప‌థ్యంలో సాగితే.. ద్వితీయార్థం ఆ హ‌త్య‌ల తాలుకూ ప‌రిశోధ‌న‌, ఫ్లాష్ బ్యాక్ నేప‌థ్యంలో ఉంటుంది. కమ‌ర్షియ‌ల్‌గా మంచి స‌క్సెస్ అయిన ఈ చిత్రానికి శేఖ‌ర్ చంద్ర అందించిన నేప‌థ్య సంగీతం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అబ్బాస్‌, ర‌విబాబు, నిఖిత‌, అంకిత త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి సుధాక‌ర్ రెడ్డి ఛాయాగ్ర‌హ‌ణం అందించారు. డిసెంబ‌ర్ 21, 2007న విడుద‌లైన 'అన‌సూయ‌'.. నేటితో 10 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

More News

'కుమారి 21F' మళ్ళీ రిపీటవుతుందా ?

'కుమారి 21F' లాంటి యూత్ ఫుల్ & సెన్సేషనల్ హిట్ అనంతరం ఆ చిత్ర దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్, కథానాయకుడు రాజ్ తరుణ్ ల క్రేజీ కాంబినేషన్ మళ్ళీ రిపీటవ్వనుంది.

సినిమా చూశాను.. డెఫనెట్ గా సూపర్ హిట్ అవుతుంది - 'హలో' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి

యూత్ కింగ్ అఖిల్,కళ్యాణి ప్రియదర్శిని కాంబినేషన్లో అన్నపూర్ణ స్టూడియోస్,'మనం'ఎంటర్ ప్రైజెస్ సమర్పణలో '

12 ఏళ్ల 'జై చిరంజీవ'

జగదేక వీరుడు అతిలోక సుందరి,చూడాలని ఉంది,ఇంద్ర వంటి హ్యాట్రిక్ విజయాల తరువాత మెగాస్టార్ చిరంజీవి,

సాయిపల్లవి కల నెరవేరినట్టే

కలలు అందరూ కంటారు.అయితే..కొన్ని కలలు మాత్రమే సాకారం అవుతాయి.

సూర్య తో జత కడుతున్న సాయి పల్లవి

సూర్య హీరోగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్న తాజా చిత్రం సంకాంతికి ప్రారంభం కానుంది. ఇది సూర్య 36వ సినిమా. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేశారు.