సైబర్ పోలీసులకు యాంకర్ అనసూయ ఫిర్యాదు
Send us your feedback to audioarticles@vaarta.com
జబర్‌దస్త్ ప్రోగ్రామ్ ద్వారా యాంకర్‌గా పాపులర్ అయిన అనసూయ తర్వాత టీవీ షోస్‌తో ఫుల్ బిజీగా మారింది. ఆ తర్వాత క్షణం సినిమాతో నటిగానూ మారింది. పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకుంటోంది. ఒక పక్క యాంకర్‌గా, మరో పక్క నటిగా ఆకట్టుకుంటోన్న అనసూయకు ఈరోజు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఓ పోకిరి అనసూయను దారుణంగా కామెంట్ చేశాడు. దీనిపై అనసూయ కూడా గట్టిగానే రిటార్ట్ ఇచ్చింది. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి చేసిన పోస్ట్‌ను కూడా అనసూయ పోస్ట్ చేయడం గమనార్హం.
కొందరు మితిమీరి వ్యవహరిస్తున్నారని అలాంటి వ్యక్తుల చర్యలు వల్ల సహనం కోల్పోతున్నానని, ఇప్పుడు కూడా తాను సహనంగా ఉంటే అర్థం లేదంటూ అనసూయ పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థ సదరు వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై తానేమీ బాధపడటం లేదని అయితే ఆ వ్యక్తిపై సరైన చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు సిటీ పోలీసులు కూడా స్పందించారు. పోలీసులు స్పందనకు అనసూయ కృతజ్ఞతలు తెలియజేశారు. సదరు చిల్లర వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అనసూయతో పాటు అనుష్క, నాగార్జునలను కూడా నిందించాడు. అయితే దీనిపై అటు నాగ్.. అనుష్క కామ్‌గానే ఉన్నారు. మరిప్పుడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com