Prema Vimanam:ఫన్, ఎమోషన్‌ మేళవింపుగా 'ప్రేమ విమానం' .. ఆకట్టుకుంటున్న ట్రైలర్, జీ5లో డైరెక్ట్ రిలీజ్

  • IndiaGlitz, [Thursday,October 05 2023]

భారతదేశంలో ఓటీటీ మార్కెట్ నానాటికీ విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులకు కంటెంట్‌తో కూడిన సినిమాలు, వెబ్ సిరీస్‌లను అందుబాటులోకి తెస్తూ.. అసలు సిసలు వినోదాన్ని అందిస్తున్నాయి. ఓటీటీ మార్కెట్ విస్తృత పరిధి దృష్ట్యా మరిన్ని సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇక ప్రేక్షకులకు ఒరిజినల్ కంటెంట్ అందిస్తూ దూసుకెళ్తోంది జీ5. వెబ్‌సిరీస్‌లు, కొత్త కొత్త సినిమాలు, రియాలిటీ షోలతో జీ 5 తెలుగువారికి ఫేవరేట్‌గా మారిపోయింది.

తాజాగా అభిషేక్ పిక్చర్స్, జీ5 బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ‘‘ప్రేమ విమానం’’ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్‌ కానుంది. అనసూయ, వెన్నెల కిషోర్ , రవి వర్మ, సంగీత్ శోభన్, సాన్వీ మేఘన, దేవాన్ష్ నామా, అనిరుధ్ నామాలు ప్రధాన తారాగణంగా సంతోష్ కాటా ఈ సినిమాను తెరకెక్కించారు. అక్టోబర్ 13 నుంచి ఈ సినిమా జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతూ వుండటంతో మేకర్స్ ప్రేమ విమానం ట్రైలర్ రిలీజ్ చేశారు.

విమానం ఎక్కాలని ఇద్దరు చిన్నారులు కనే కల.. పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టాలని భావించే ప్రేమ జంటను బేస్ చేసుకుని ‘‘ప్రేమ విమానం’’ సినిమాను తెరకెక్కించారు. అనసూయ, రవివర్మకు ఇద్దరు పిల్లలు.. కూలీ నాలీ చేసుకుని జీవించే ఈ కుటుంబం వున్న దాంట్లో హాయిగా వుంటుంది. ఇక సంపన్న కుటుంబానికి చెందిన సాన్వీని సంగీత్ ప్రేమిస్తాడు. చాటు మాటుగా కలుసుకోవడం చేస్తుండే ఈ జంట తమ ప్రేమను బతికించుకోవడానికి పారిపోవాలనుకుంటారు. ఇటువైపు చూస్తే పిల్లలిద్దరూ ఎలాగైనా విమానం ఎక్కాలనే ఉద్దేశంతో తమ వద్ద వున్న కొంచెం డబ్బు తీసుకుని పట్నానికి వచ్చేస్తారు. ఓ వైపు పిల్లలు, మరోవైపు ప్రేమ జంట.. ఈ ప్రయాణంలో వీరు ఎదుర్కొనే కష్టాలు, మలుపులు, సంతోషాలు, బాధలను సినిమాగా తీశారు. మరి ప్రేమ జంట ఒక్కటైందా... పిల్లలు విమానం ఎక్కారా ఈ విషయం తెలియాలంటే అక్టోబర్ 13 వరకు వెయిట్ చేయాల్సిందే.

More News

Bigg Boss 7 Telugu : చీటింగ్ చేయలేదంటూ యావర్ కన్నీళ్లు .. టాస్క్‌ల్లో రెచ్చిపోయిన శివాజీ-ప్రశాంత్

బిగ్‌బాస్‌లో 7 విజయవంతంగా ఐదో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటికే నలుగురు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యారు.

Pawan Kalyan:కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము జగన్‌కు లేదు.. పెడన వారాహి సభలో పవన్ విమర్శలు

కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము సీఎం జగన్‌కు లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు.

Chandra Babu:చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపసై విచారణను రేపటికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు.

Varalaxmi Sarathkumar:డ్రగ్స్ కేసులో నోటీసులంటూ ప్రచారం .. నా ఫోటోతో వార్తలు , ఏం జరిగిందంటే : క్లారిటీ ఇచ్చిన వరలక్ష్మీ

వరలక్ష్మీ శరత్ కుమార్.. ఈ తరంలోని అద్భుతమైన నటీమణుల్లో ఆమె కూడా ఒకరు.

Talasani Srinivas Yadav:చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

టీడీపీ జాతీయాధ్యక్షులు చంద్రబాబు అరెస్టును తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు.