Anasuya:విమానంలో అనసూయ క్యారెక్టర్ ఇదే .. కళ్లకు కాటుక పెట్టి, ఒర చూపులతో పిచ్చెక్కిస్తోన్న రంగమ్మత్త
- IndiaGlitz, [Monday,May 15 2023]
న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టి.. యాంకర్‌గా, నటిగా ఎదిగారు అనసూయ భరద్వాజ్. తెలుగులో డిమాండ్ వున్న నటీమణుల్లో ఆమె కూడా ఒకరు. అందంతో పాటు అభినయం కలగలిసి వుండటంతో అనసూయకు లక్షలాది మంది అభిమానులు వున్నారు. ఇక మనసులో ఏమున్నా ముఖం మీద కొట్టినట్లు మాట్లాడటం ఆమె స్టైల్. అందుకే అనసూయ వివాదాలతోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈరోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా అనసూయకు ఆమెకు కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖులు , సన్నిహితులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
సుమతి అనే క్యారెక్టర్ చేస్తున్న అనసూయ :
జబర్దస్త్ ప్రోగ్రామ్ నుంచి తప్పుకున్న తర్వాత ఆమె తన ఫోకస్ సినిమాలపైనే పెట్టారు. ప్రస్తుతం అనసూయ నటిస్తున్న చిత్రం ‘‘విమానం’’. విలక్షణ నటుడు, దర్శకుడు సముద్రఖని ఇందులో లీడ్ రోల్ పోషిస్తున్నారు. శివప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేట్ వర్కస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన విమానం టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అనసూయ ‘‘సుమతి’’ అనే క్యారెక్టర్ పోషిస్తున్నారు. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సుమతి క్యారెక్టర్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. జీవితంలో ఒక్కొక్కరికీ ఒక్కో కథ ఉంటుంది. ప్రతీ కథలోనూ హృదయాలను కదిలించే భావోద్వేగం ఉంటుంది. అలాంటి సుమతి అనే పాత్రలో అనసూయ నటిస్తోందని చిత్ర యూనిట్ తెలియజేసింది. ఇక వీడియో విషయానికి వస్తే.. అనసూయ అందంగా రెడీ అవుతూ వుంటుంది. అసలు ఆమె అలా తయారు కావటానికి గల కారణాలేంటి? అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.
జూన్ 9న ప్రేక్షకుల ముందుకు విమానం:
కొద్దిరోజుల క్రితం ‘‘విమానం’’లో నటిస్తున్న నటీనటుల పేర్లు, పోస్టర్స్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. వీరయ్య అనే అంగవైకల్యం వున్న తండ్రి పాత్రలో సముద్రఖని, సుమతి పాత్రలో అనసూయ భరద్వాజ్, రాజేంద్రన్ పాత్రలో రాజేంద్రన్, డేనియల్ పాత్రలో ధనరాజ్, కోటి పాత్రలో రాహుల్ రామకృష్ణ, వీరయ్య కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ నటిస్తున్నారు. మరి ఈ తండ్రీ కొడుకులకు సుమతి, రాజేంద్రన్, డేనియల్, కోటి పాత్రలకు ఉన్న లింకేంటి? పాత్రల మధ్య ఉండే ఎమోషనల్ కనెక్టివిటీ ఏంటి? వంటి విషయాలు తెలియాలంటే జూన్ 9 వరకు ఆగాల్సిందే.