బిజీగా పుష్పరాజ్.. రంగంలోకి రంగమ్మత్త!

  • IndiaGlitz, [Thursday,July 08 2021]

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప' షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది. రెండు రోజుల క్రితమే దర్శకుడు సుకుమార్ హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఈ చిత్ర షూటింగ్ ని రీస్టార్ట్ చేశారు. మిగిలిన భాగం షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాదే పుష్ప మొదటి భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

పుష్ప ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది షూటింగ్ ఎంత వేగంగా ఫినిష్ అవుతుందనే అంశంపై ఆధారపడి ఉంటుంది. మైత్రి మూవీస్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఏస్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉండగా కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతుండడంతో టాలీవుడ్ సినిమాల షూటింగ్స్ తిరిగి ప్రారంభం అయ్యాయి. పుష్ప చిత్రంలో నటి, యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం అనసూయ పుష్ప షూటింగ్ లో జాయిన్ అయింది.

ఈ విషయాన్ని అనసూయ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. పుష్ప లొకేషన్ పిక్ ని అభిమానులతో పంచుకుంది. 'బ్యాక్ తో వర్క్.. పుష్ప' అని పోస్ట్ చేసింది. రంగస్థలం చిత్రంలో అనసూయ రంగమ్మత్త పాత్రని అంత త్వరగా మరిచిపోలేం. రంగస్థలం చిత్రంలో అనసూయ రోల్ చాలా కీలకంగా నిలిచింది.

దీనితో పుష్పలో కూడా సుకుమార్ అనసూయకు పవర్ ఫుల్ పాత్రే ఇచ్చి ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పుష్ప చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ సరసన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

More News

'జీ 5'లో జూలై 9న ఒరిజినల్‌ మూవీ 'స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌ : టెంపుల్‌ అటాక్‌' విడుదల

ప్రపంచవ్యాప్తంగా భారతీయ కంటెంట్ కోరుకునే వీక్షకుల కోసం వివిధ భాషలు, వివిధ జోనర్లలో అర్థవంతమైన, ప్రయోజనకరమైన కంటెంట్‌ అందించే భారతదేశపు అతి పెద్ద ఓటీటీ వేదిక 'జీ 5'.

మా బావగారు అంటూ వైఎస్ఆర్ పై మోహన్ బాబు ఎమోషనల్ కామెంట్స్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేడు.

రాంచరణ్ తర్వాత సమంత.. ఎంత కాస్ట్లీ అయినా ఓకే, అందుకేనా!

పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టేలా దూసుకుపోతోంది టాలీవుడ్. బాహుబలి తర్వాత ఈ సాంప్రదాయం మొదలయింది అని చెప్పొచ్చు.

డాక్టర్లూ ఈ వీడియో మీ దగ్గర పెట్టుకోండి.. ఇంత నిర్లక్ష్యమా, వందలాదిమంది ఇలా.. 

కరోనా మహమ్మారి విడతల వారీగా ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ఇప్పటికే మొదటి వేవ్, రెండవ వేవ్ అటూ లక్షలాది ప్రాణాలని బలితీసుకుంది మహమ్మారి.

నీళ్లు లేని బావిలో దూకాలంటే దూకొచ్చు.. ప్రకాష్ రాజ్ పై నరేష్ సెటైర్లు!

మా ఎన్నికల వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. గత మార్చిలోనే మా ఎన్నికలు జరగాల్సింది.