ఖిలాడిలో 'చంద్రకళ'గా సిగ్గుపడుతోన్న అనసూయ.. ఎంత పద్ధతిగా వుందో..!!
Send us your feedback to audioarticles@vaarta.com
టీవీ షోలు, ఈవెంట్స్‌తో పాటు సినిమాల్లోనూ ఛాన్స్‌లు దక్కించుకుని దూసుకెళ్తున్నారు స్టార్ యాంకర్ అనసూయ. యాంకరింగ్‌తో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు సుకుమార్ లైఫ్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. రంగస్థలంలో రంగమ్మత్తగా కనిపించి నటిగా ఓ మెట్టుపైకెక్కిన అనసూయ.. ఇటీవల పుష్పలో అంతకుమించి అనిపించారు. ఈ చిత్రంలో దాక్షాయణిగా నెగిటివ్ షేడ్ వున్న పాత్ర పోషించి భయపెట్టారు అనసూయ. అమ్మోరు లాంటి పెద్ద బొట్టు, చేతికి ఉంగరాలు, మెడలో నగలు ధరించి రౌద్రంగా కనిపించారు. ఫాహద్ ఫజిల్, సునీల్ లాంటి వారు విలన్లుగా వున్నా.. అనసూయ తన మార్క్ చూపించారు. పుష్ప' పార్ట్ 2లో ఆమె పాత్ర హైలైట్ గా నిలుస్తుందని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఖిలాడి' సినిమాలోనూ అనసూయ ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె చంద్రకళ అనే పాత్ర పోషిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రయూనిట్ శుక్రవారం విడుదల చేసింది. చీర కట్టుకొని, సిగ్గుపడుతూ.. ముఖంపై చిరునవ్వులు చిందిస్తూ చాలా పద్ధతిగా కనిపిస్తున్నారు అనసూయ. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ‘‘ఖిలాడీ’’లో అనసూయ పాత్ర గురించి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె డ్యూయల్ రోల్ పోషిస్తోందని.. హీరోయిన్ తల్లి క్యారెక్టర్‌లో, హీరోకి అత్తగా కనిపిస్తుందని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇవాళ్టీ పోస్టర్‌లో అనసూయ గెటప్ చూస్తుంటే.. తల్లి క్యారెక్టర్‌లా అనిపించడం లేదు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
ఇకపోతే 'ఖిలాడి' సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. కోనేరు సత్యనారాయణ, హవీష్ నిర్మించిన ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. వీర సినిమా తర్వాత రమేశ్ వర్మ - రవితేజ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు వున్నాయి. ఫిబ్రవరి 11న ఖిలాడి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments