నువ్ ఎవడివి నన్ను అడగడానికి.. అనసూయ ఆగ్రహం!

  • IndiaGlitz, [Saturday,May 16 2020]

జ‌బ‌ర్‌ద‌స్త్ ప్రోగామ్‌తో పాపులారిటీ సంపాదించుకున్న యాంక‌ర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్ పుట్టిన‌రోజు నేడు(మే 15). ఈ సంద‌ర్భంగా అన‌సూయ కీస‌ర మండ‌లంలోని ప‌లువురు గ‌ర్భిణీల‌కు న్యూటిష‌న్ కిట్లను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు ఆమె భ‌ర్త సుశాంక్ భ‌ర‌ద్వాజ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో స్పందిస్తూ.. గ‌ర్భిణుల‌కు న్యూటిష‌న్ కిట్లను అంద‌జేయ‌డం త‌న‌కు ఎంతో ఆనందానిచ్చింద‌ని.. ప్రస్తుత ప‌రిస్థితుల్లో స‌మ‌ర్ధవంతమైన పోష‌కాలు అందించ‌డానికి వారిలో ధైర్యాన్ని నింప‌డానికి తాను ఈ పనిచేస్తున్నట్లు తెలిపింది. మంచి పనిచేసిన అన‌సూయ‌ను రాచ‌కొండ పోలీసులు అభినందించారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఈ కార్యక్రమం అనంతరం అభిమానులతో అను ముచ్చటించింది.

ఇదీ అసలు సంగతి..!

ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో చిట్ చాట్ చేసిన ఈ భామకు ఊహించని ప్రశ్న.. ఎదురైంది. దీంతో పుట్టినరోజున మొత్తం మూడాఫ్ అయ్యింది. ఈ సందర్భంగా ఇంట్లో తనకు సౌకర్యంగా ఉండే బట్టలు వేసుకుని చిట్ చేసిన అనసూయకు ఓ నెటిజన్ విచిత్ర ప్రశ్న వేశాడు. ‘ఇద్దరు పిల్లల తల్లివి.. ఇలాంటి బట్టలు వేసుకోవడం ఏంటి..?’ అని ప్రశ్నించాడు. దీంతో అనసూయకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ఈ ప్రశ్నకు బదులిస్తూ.. ‘నేను ఎలాంటి బట్టలు వేసుకుంటే నీకేంటి.. నువ్వు ఎవడికి నన్ను అడగడానికి..’ అని తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయింది. ఇలా చాలా మందే చిత్ర విచిత్రాలుగా ప్రశ్నలేశారు. కాగా ఇలాంటి ఘటనలు అనసూయకు ఎదురవ్వడం ఇదేం మొదటి సారి కాదు. సోషల్ మీడియా వేదికగా ఈ హాట్ యాంకర్‌పై చాలా సార్లే వివాదం రేగింది.

More News

యంగ్ డైరెక్టర్ దుర్మరణం.. విషాదంలో శంకర్!

సినిమా ఇండస్ట్రీని విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఓ వైపు కరోనా మహమ్మారి భయం.. మరోవైపు ఇలా వరుస విషాదాలతో ఇండస్ట్రీ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే పలువురు

ఏపీలో త్వరలో తెరుచుకోనున్న ప్రధాన దేవాలయాలు

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో యావత్ భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నది. ఇప్పటి వరకూ 3.0 లాక్‌డౌన్లు పూర్తి కాగా రేపో ఎల్లుండో మరోసారి పొడిగింపు

థియేటర్లకు ఆదాయం పెరిగే ఐడియా ఇచ్చిన నాగ్ అశ్విన్!

సావిత్రి బయోపిక్ ‘మహానటి’ చిత్రంతో స్టార్ హోదా అందుకున్న యువ దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో ఆయన పేరు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు

రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త..

భారతదేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరిట రూ.20 లక్షల కోట్లతో భారీ ప్యాకేజి ప్రకటించిన కేంద్రం..

డాక్టర్లు, వైద్య సిబ్బందిపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య