పూరి, దేవరకొండ 'లైగర్' అంచనాలు పెంచేసిన హీరోయిన్ తండ్రి

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'లైగర్'. హీరోలని మాస్ అండ్ స్టైలిష్ గా ప్రజెంట్ చేయడంలో పూరి దిట్ట. అందుకే ప్రతి హీరో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించాలని భావిస్తారు.

లైగర్ చిత్రాన్ని హీరోయిన్ ఛార్మి, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కలసి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అనన్య పాండే తండ్రి, నటుడు చుంకి పాండే బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లైగర్ మూవీపై అంచనాలు పెంచేశాడు.

లైగర్ సినిమా కోసం నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ చిత్రం పెద్ద కమర్షియల్ సక్సెస్ అవుతుందని ముందు నుంచి అనన్యకు చెబుతూనే ఉన్నా. లైగర్ రషెస్ చూశాను. మై గాడ్.. విజయ్ దేవరకొండ పెర్ఫామెన్స్ అద్భుతం. విజయ్, అనన్య జోడి పర్ఫెక్ట్ గా ఉంది అని చుంకి పాండే ప్రశంసలు కురిపించాడు.

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ లాంగ్ హెయిర్ తో విభిన్నమైన లుక్ లో కనిపిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి నుంచి రాబోతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. యాక్షన్, రొమాన్స్ అన్ని అంశాలు పక్కాగా ఉండేలా పూరి ఈ చిత్ర స్క్రిప్ట్ రెడీ చేశారు.

More News

నిత్యావసర ధరలు ఆకాశానికి, కానీ టికెట్ రేట్లు మాత్రం.. నాని కౌంటర్

టాలీవుడ్ లో టికెట్ రేట్లు, థియేటర్స్ సమస్యపై ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు.

పిక్ టాక్: రాశి ఖన్నా సెక్సీ ఫోజు.. హాట్ అండ్ స్టైలిష్

అందాల తార రాశి ఖన్నా గురించి తెలుగు ప్రేక్షుకులకు పరిచయం అక్కర్లేదు. చూపు తిప్పుకోలేని అందంతో రాశి ఖన్నా టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకుంది.

'పుష్ప' టీంని చుట్టుముట్టిన డెంగ్యూ.. అల్లు అర్జున్, రష్మిక కూడా ?

అల్లు అర్జున్ అభిమానులని చిన్నపాటి కలవరానికి గురిచేసే వార్తే ఇది. కొన్ని రోజుల క్రితం దర్శకుడు సుకుమార్ డెంగ్యూ ఫీవర్ కు గురికావడంతో పుష్ప షూటింగ్ ఆగిపోయింది.

అనవసరంగా నన్ను లాగుతున్నారు.. పోర్న్ వీడియోస్ వివాదంపై ప్రముఖ నటి

రాజ్ కుంద్రా పోర్న్ వీడియోస్ వివాదం రోజుకొక మలుపు తిరుగుతోంది. రాజ్ కుంద్రా ఏ ఏ యాప్స్ కోసం పోర్న్ వీడియోస్ నిర్మించారు..

'SR కల్యాణమండపం' ట్రైలర్: ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ బ్యాలన్స్ చేస్తూ..

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎస్ ఆర్ కల్యాణమండపం. ఆగష్టు 6న ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది.