'ఆనందో బ్రహ్మ' (దెయ్యాలకి మనుషులకి మధ్య జరిగే ఘర్షణ) మెషన్ టీజర్ లాంచ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పటి వరకు వచ్చిన హార్రర్ కామెడీ చిత్రాలు అన్నీ దెయ్యాలు మనుషులని భయపెట్టడం అనే ఇతివృత్తంతో వచ్చినవే. కానీ, మొట్టమొదటిసారి తెలుగు సినిమా చరిత్రలో మనుషులు దెయ్యాలని భయపెట్టడం అనేది ఈ “ఆనందో బ్రహ్మ“ లో చూస్తారు. పూర్తి స్థాయి హార్రర్ కామెడీ కథాంశంతో దెయ్యాలకి,మనుషులకి మధ్య జరిగే ఘర్షణ లో మనుషులు చివరికి ఎలా గెలుస్తారు అనేది ఈ చిత్రం లో కొత్తదనం.ఆధ్యంతం ప్రేక్షకుల్ని అలారిస్తూ,ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
“పింక్” ”ఘాజీ” వంటి విబిన్నమైన చిత్రాలతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్న తాప్సి ప్రధానపాత్రలో,శ్రీనివాస్ రెడ్డి ,వెన్నెల కిషోర్,”తాగుబోతు” రమేష్,”శకలక” శంకర్,రాజీవ్ కనకాల ఇతర ముఖ్యపాత్రల్లో మహి వి రాఘవ్ రచన,దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందించబడింది.
విజయ్ చిల్లా & శశి దేవిరెడ్డి గారి నిర్మాణంలో 70MM ENTERTAINMENTS బ్యానర్లో రుపొందిచిన ఈ చిత్రం పూర్తి స్తాయి ఎంటర్టైనర్. ఈ సినిమా తాలూకు మోషన్ పోస్టర్ ఈ మధ్యనే “యంగ్ రెబెల్ స్టార్” ప్రభాస్ గారి చేతుల మీదుగా ఆవిష్కృతమైంది.
హీరోయిన్ తాప్సి మాట్లాడుతూ... నాకు చాలా రోజుల క్రితం ఈ స్టోరి చెప్పారు. చాలా బాగుంది. నాకు కూడా తెలుగుతలో మంచి హిట్ చిత్రం కావాలి సో ఈ చిత్రం చేస్తాను అని ప్రోడ్యూసర్ కి చెప్పాను. ఇది కాన్సెప్ట్ ఫిల్మ్ ఎవరూ హీరో కాదు.. ఎవరు హీరోయిన్ కాదు. కాన్స్‌ప్ట్ మాత్రమే హీరో.. హర్రర్ చిత్రం కాని కొత్త చిత్రం. ఇటీవలే భాహుబలి లాంటి చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ అండ్ కాన్సెప్ట్ హీరోగా ప్రపంచాన్ని ఊపేసింది. అలాంటి చిత్రం వచ్చిన ఈ తెలుగు లో ఈ చిత్రం రావటం అది కూడా చాలా మంచి కాన్సెప్ట్ తో వస్తుంది. తప్పకుండా తెలుగులో నాకు మంచి హిట్ చిత్రం గా ఆనందో బ్రహ్మ వుంటుంది.
దర్శకుడు మహి మాట్లాడుతూ.. ఈ కథ చెప్పగాను అంగీకరించిన నిర్మాతలకి హీరోయిన్ తాప్సి కి థ్యాంక్స్. ఈ చిత్రం తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. భయానికి నవ్వంటే భయం అనే కాన్సెప్ట్ తో మీముందుకు వస్తుంది.
సుధీర్ బాబు మాట్లాడుతూ.. ఈ ప్రోడక్షన్ నా చిత్రం తో ప్రారంభమైంది. తప్పకుండా ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుంది. హర్రర్ కామెడి లో ట్రెండ్ నా ప్రేమకథాచిత్రం.. చాలా మంది సీక్వెల్ చేద్దామని చెప్పారు కాని నాకు ధైర్యం చాలలేదు. ఇప్పడు ఈ చిత్రం తప్పకుండా ప్రేమకథా చిత్రం కంటే బావుంటుందని నమ్ముతున్నాను.
పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది నిర్మాతలు : విజయ్ చిల్లా & శశి దేవిరెడ్డి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com