'తొలిప్రేమలో' ప్రతి సన్నివేశం అందంగా ఉంటుంది - ఆనంది
Send us your feedback to audioarticles@vaarta.com
`కయల్` అనే పేరుతో తమిళంలో విడుదలైన ఈ చిత్రం అక్కడ చాలా పెద్ద హిట్టయ్యింది. సునామీ వచ్చినప్పుడు కన్యాకుమారిలో బ్రతికిన ఇద్దరు వ్యక్తులు మధ్య జరిగే కథ ఇదని హీరోయిన్ ఆనంది అన్నారు. యాదాద్రి ఎంటర్ టైన్మెంట్స్ తొలి ప్రయత్నంగా తమిళంలో ఘనవిజయం సాధించిన `కయల్` చిత్రాన్ని `తొలిప్రేమలో` అనే పేరుతో తెలుగులోకి విడుదల చేస్తున్నారు. ప్రేమఖైదీ, గజరాజు వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ప్రభుసాల్మన్ దర్శకత్వంలో గౌళీకార్ శ్రీనివాస్ సమర్పణలో తమటం శ్రీనివాస్, జయారపు రామకృష్ణ నిర్మాతలుగా ఈ సినిమా రూపొందుతుంది. చంద్రన్, ఆనందిని, ప్రభు ప్రధాన తారాగణంగా నటించారు. సినిమా ఆగస్ట్ 26న విడుదలవుతుంది. డి.ఇమాన్ సంగీతం అందించిన ఆడియో గ్రాండ్ ప్లాటినమ్ వేడుక మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆనంది ప్రభు సాల్మన్ గారు ఎన్నో డిఫరెంట్ మూవీస్ చేశారు. అందులో ఈ చిత్రమొకటి. సినిమా కోసం 80 రోజుల పాటు షూటింగ్ చేశాం. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ కోసం చాలా కష్టపడ్డాం. ప్రతి సన్నివేశం అందంగా ఉంటుంది. తెలుగులో ఈ సినిమా విడుదల చేస్తున్న నిర్మాతలకు పెద్ద ధన్యవాదాలను తెలియజేశారు. 2016లో బిచ్చగాడు ఎంత సక్సెస్ సాధించిందో అంతటి సక్సెస్‌ను మా చిత్రం సాధిస్తుందని భావిస్తున్నాం. సినిమా విడుదల విషయంలో సి.జె.శోభారాణిగారు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారని నిర్మాతలు అన్నారు.
ఇమాన్గారు చాలా మంచి మ్యూజిక్ అందించారు. సాంగ్స్ విజువల్‌గా ఎంతో బావున్నాయి. నా పెళ్ళిచూపులు చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రతి చిత్రం కూడా అదే విధంగా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటాను. ఈ సినిమా కూడా అంత పెద్ద విజయాన్సి సాధించాలని రాజ్ కందుకూరి అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, దర్శకుడు ప్రభు, సి.జె.శోభారాణి, సాయివెంకట్, సముద్ర, అంజి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout