'ఆనందో బ్రహ్మ' (భయానికి నవ్వంటే భయం) ఆగస్ట్ 18న గ్రాండ్ రిలీజ్

  • IndiaGlitz, [Wednesday,July 05 2017]

ఇప్పటి వరకు వచ్చిన హార్రర్ కామెడీ చిత్రాలన్నీ దెయ్యాలు మనుషులని భయపెట్టడం అనే ఇతివృత్తంతో వచ్చినవే. కానీ, మొట్టమొదటిసారి తెలుగు సినిమా చరిత్రలో మనుషులు దెయ్యాలని భయపెట్టడం అనేది ఈ “ఆనందో బ్రహ్మ“ లో చూస్తారు. పూర్తి స్థాయి హార్రర్ కామెడీ కథాంశంతో దెయ్యాలకి, మనుషులకి మధ్య జరిగే ఘర్షణ లో ఎవ‌రు గెలుస్తార‌నేది చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఎంట‌ర్‌టైన్‌మెంట్ చేస్తూ ఈ చిత్రం లో కొత్తగా చూపించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ ఈ మధ్యనే “ రెబెల్ స్టార్” ప్రభాస్ గారి చేతుల మీదుగా విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాకు భారీ క్రేజ్ దక్కింది. ప్ర‌స్తుతం పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే ట్రేడ్ లో బిజినెస్ క్రేజ్ ని సొంతం చేసుకున్న‌ ఈ క్రేజీ మూవీ ఆగస్ట్ 18న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
“పింక్” ”ఘాజీ” వంటి విబిన్నమైన చిత్రాలతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్న తాప్సి ప్రధానపాత్రలో, శ్రీనివాస్ రెడ్డి ,వెన్నెల కిషోర్,”తాగుబోతు” రమేష్,”ష‌కలక” శంకర్, రాజీవ్ కనకాల ఇతర ముఖ్యపాత్రల్లో మహి వి రాఘవ్ రచన, దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందించబడింది. విజయ్ చిల్లా & శశి దేవిరెడ్డి గారి నిర్మాణంలో 70MM ENTERTAINMENTS బ్యానర్లో రుపొందించిన ఈ చిత్రం పూర్తి స్తాయి ఎంటర్టైనర్ గా తెర‌కెక్కింది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ…. తాప్సీ వరుస సూపర్ హిట్స్ తో బాలీవుడ్ లో దుసుకుపోతున్న సంగతి తెలిసిందే. అలాంటి టైంలో తెలుగులో కంబ్యాక్ ఫిల్మ్ గా ఆనందో బ్రహ్మ చిత్రంలో నటించింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ అంద‌రిని ఆక‌ట్టుకుంది. హీరోయిన్ తాప్సీ స‌రికొత్త‌గా అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో మరో కోణంలో చూడబోతున్నాం. దర్శకుడు మహి వి రాఘవ్ టెక్నిక‌ల్ గా, క‌మ‌ర్షియ‌ల్ గా చాలా బాగా తెరకెక్కించాడు. ప్రేక్షకులకు ఊహించని కామెడీ, థ్రిల్ అందించబోతున్నాం. ఇది కాన్సెప్ట్ ఫిల్మ్. హీరో హీరోయిన్లు కనిపించరు… కథ, క్యారెక్టర్లు మాత్రమే కనిపిస్తాయి. హార్రర్ చిత్రాల్లో సరికొత్త అనుభూతిని పంచబోతున్నాం. ప్రస్తుతం పోస్ట్ నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్ట్ 18న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నాం. అని అన్నారు.
నటి నటులు: తాప్సి పన్ను,శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్,”తాగుబోతు”రమేష్,”శకలక”శంకర్,రాజీవ్ కనకాల, పోసాని కృష్ణ మురళి,తనికెళ్ళ భరణి,విద్యులేఖ రామన్,మరియు ప్రభాస్ శ్రీను

More News

Tammareddy's grandson breathes his last

Saketh Ram Vellanki, grandson of yesteryear director Tammareddy Bharadwaj, breathed his last on the night of July 3rd, in the US.

Rajinikanth finally speaks on critical issue

Rajinikanth has finally opened his mouth on the ongoing strike by theatres in Tamil Nadu.  Following the introduction of GST, the government decided to impose an additional entertainment tax of 28 per cent.  And Kollywood has recoiled in horror at this.  Days after many in Kollywood, including Kamal Haasan slammed the move, Rajini has done it.

Nani's cinematographer calls it quits

The cinematographer of 'Middle Class Abbayi', Diwakar Mani, has reportedly quit the project.  He has shot 30 per cent of the movie and over the last few weeks, had been falling out with the director, Venu Sriram.

Anu, Pooja to replace Kajal, Samantha

Kajal Aggarwal and Samantha Ruth Prabhu are both in their early 30s.  They are not as actively choosing movies of late (in the case of Kajal, she is doing Tamil and Hindi in equal measure), and Samantha could only be doing really experimental subjects post her marriage to satisfy her creative urges.

A solution for theater within today !!!

The Tamil Nadu theater strike has entered third day today. As a protest against Tamil Nadu Government's levy of 30% entertainment tax in excess of the GST levied by the Union Government, the theater owners had announced a strike and the movie halls across the state have been shut down since Monday.