రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కి బ్రేక్ నిచ్చిన 'ఆనందం'కి 16 ఏళ్లు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం తెలుగులో నెం.1 మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్నాడు యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్. 1999లో విడుదలైన దేవి చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమైన దేవిశ్రీకి తొలిగా బ్రేక్‌నిచ్చింది మాత్రం శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఆనందం చిత్రమే.
ఓ ఫ్రెష్ లవ్‌స్టోరీ చిత్రంతో రూపొందిన ఈ చిత్రం ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉన్నా.. సెకండాఫ్ సినిమాకి ప్రధాన బలమైంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలు కూడా కథకు తగ్గట్టు ఫ్రెష్‌గా ఉండి.. ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన ఈ చిత్రంలో ఆకాష్, రేఖ హీరోహీరోయిన్లుగా నటించగా వెంకట్, తను రాయ్ కథకు కీలకమైన పాత్రల్లో కనిపించారు. 2001లో ఇదే సెప్టెంబర్ 28న విడుదలైన ఆనందం చిత్రం నేటితో 16 ఏళ్లను పూర్తిచేసుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com