రూపాయికే ‘బామ్మ’ టిఫిన్.. రంగంలోకి దిగిన ఆనంద్ మహీంద్రా!

  • IndiaGlitz, [Wednesday,September 11 2019]

ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం టిఫిన్ చేయాలంటే ప్లేట్‌కు 30 నుంచి 40 రూపాయిలు ఖర్చుపెట్టాల్సిందే. ఒక్క ప్లేట్ తింటే కడుపు నిండితుందా అంటే అదీ చాలచాలనిదే. అంటే కాస్త మనస్పూర్తిగా.. సంతృప్తిగా తినాలంటే సుమారు రూ.50-60 ఖర్చు చేసి తీరాల్సిందే. ప్లేట్ ఇడ్లీ తినాలంటే కనీసం లేదంటే 30 రూపాయిలు చెల్లించక తప్పదు. అయితే ఒక్కరూపాయి ఇడ్లీ పెడితే ఎలా ఉంటుంది..? నిజంగా ఇది వినడానికి కూడా కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ.. అవును.. ఈ అసాధ్యాన్ని ఓ భామ్మ సుసాధ్యం చేసింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ భామ్మ రూపాయికే టిఫిన్ పెడుతోంది.

పూర్తి వివరాల్లోకెళితే.. కోయంబత్తూరులోని కమలాథల్(82) అనే పెద్దావిడ రూపాయికే ఇడ్లీ, బోండా అమ్ముతోంది. ప్రతి రోజూ ఉదయాన్నే 5 గంటలకు ఈ భామ్మ నిద్ర లేస్తుంది. రోజుకు వెయ్యి ఇడ్నీలు, బోండాలు(మైసూర్ బజ్జీలు) తయారు చేస్తుంది. ఉదయం 6 గంటలకల్లా తన షాపును తెరుస్తుంది. ఆమె తయారుచేసిన ఇడ్లీ, సాంబార్, చట్నీ బాగా రుచిగా ఉంటుంది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడటంతో భామ్మ టిఫిన్ కోసం క్యూ కడుతున్నారు.

నా టిఫిన్‌ను మెచ్చుకుంటున్నారు!

‘గత 30 ఏళ్లుగా ఇదే పనిచేస్తున్నాను. గతంలో ఒక్కో ఇడ్లీ, బోండాను 50 పైసలకే అమ్మేదాన్ని.. అయితే సరుకులు రేటు పెరగడంతో ఇంకో 50 పైసలు పెంచి.. రూపాయికి అమ్ముతున్నాను. నా టిఫిన్ కోసం చాలా దూర ప్రాంతాల నుంచి జనాలు వస్తున్నారు. అందరూ నా టిఫిన్‌ను మెచ్చుకుంటున్నారు’ అని కమలాథర్ ఆనంద పడుతోంది. అంతేకాదు.. ఎవరైనా డబ్బులు లేకుండా టిఫిన్ తిన్నా.. చేతిలో ఎంతుంటే అంత ఇచ్చి పోతారట. పది రూపాయిలకు తిని ఐదు రూపాయిలిచ్చినా ఆ భామ నోరు మెదపకుండా తీసుకుంటుందట.

భామ్మ హోటల్లో పెట్టుబడి పెడతా!

కోయంబత్తూరు భామ్మ హోటల్ గురించి తెలుసుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం కురిపించారు. నిజంగా ఇలాంటి కథనాలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయని.. మనం జీవితంలో చేసే అన్నిపనులు కమలాథల్ చేస్తున్న సేవలో కొంత భాగానికి అయినా సరితూగుతాయా? అని అనిపిస్తోందని ఒకింత భావోద్వేగాని లోనయ్యారు. కమలాథల్ ఇంకా కట్టెల పొయ్యినే వాడుతున్నట్లు తాను వీడియోలో చూశానని.. ప్రజలెవరైనా ఆమె వివరాలు కనుక్కొని చెబితే కమలాథల్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు, ఓ ఎల్పీజీ స్టవ్‌ను కొనిచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆయన.. ట్వీట్‌కు పలువురు నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తూ ప్రశంసిస్తున్నారు.

More News

‘నేనెవరో తెలుసా’.. పోలీసులకు అఖిల వార్నింగ్!

టీడీపీ నేతలు తలపెట్టిన ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పల్నాడులో మొదలైన రాజకీయ వేడి ఆత్మకూరుకు తాకేందుకు సిద్ధమైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా

ఎక్కడికక్కడ అరెస్ట్‌లు.. పోలీసుల అదుపులో బాబు, లోకేశ్!

ఏపీలో రాజకీయ దాడుల వ్యవహారంలో పోలీసుల ఉదాసీన వైఖరి కారణంగా... ఆదిలోనే ఆగిపోవాల్సిన గొడవలు ఇప్పుడు శాంతిభద్రతల సమస్యగా మారడం గమనార్హం.

దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ర‌విబాబు ద‌ర్శ‌క నిర్మాతగా అక్టోబ‌ర్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న'ఆవిరి'

హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఎ ఫ్ల‌యింగ్ ఫ్రాగ్స్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ర‌విబాబు దర్శ‌క నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం `ఆవిరి`.

ప్రభాస్‌ రాకపోతే టవర్‌పై నుంచి దూకేస్తా: వీరాభిమాని

హీరోలు అంటే అభిమానులకు ఎంత పిచ్చి ఉంటుందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.

మ‌రోసారి అదే ప్ర‌య‌త్నం చేస్తున్న నాని

మ‌రోసారి నాని త‌న‌కు పెద్ద‌గా రాని ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నాడంటూ వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇంత‌కు నాని చేయ‌బోయే ప్రయత్నం కొత్త‌దేమీ కాదు.