నటుడు కావాలన్నది నాన్న కల .. అందుకోసమే హైదరాబాద్‌కి, కానీ: ఆనంద్ దేవరకొండ ఎమోషనల్
Send us your feedback to audioarticles@vaarta.com
మా నాన్న నటుడవ్వాలనే లక్ష్యంతో 35 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారని.. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన యాక్టర్ కాలేకపోయారని అన్నారు యువ నటుడు ఆనంద్ దేవరకొండ. యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘‘పుష్పక విమానం’’. ఈ సినిమాలో విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించాడు. దామోదర దర్శకత్వం వహించగా.. గీత్ సైని, శాన్వి మేఘన హీరోయిన్లుగా నటించారు. నవంబర్ 12న పుష్పక విమానం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం విశాఖపట్నంలో ‘పుష్పక విమానం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. నాన్న నటుడు కాలేకపోయినా అన్నయ్య (విజయ్), నేనూ దానిని సాధించామని, ఇప్పుడు నాన్న చాలా సంతోషంగా ఉన్నారు అని ఆనంద్ చెప్పారు. ఈ సినిమాలో హీరోయిజం ఉండదని.. చిట్టిలంక సుందర్ అనే పాత్రలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కనిపిస్తానని ఆయన తెలిపారు. ఇది కామెడీ థ్రిల్లర్ సినిమా అని పెళ్లితో ముడిపడి ఉంటూ ఒక మెసేజ్ ఇచ్చామని ఆనంద్ చెప్పారు. వైవాహిక జీవితం గురించి ఎన్నో ఊహించుకున్న చిట్టిలంక సుందర్ భార్య వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నదే కథ’’ అని కాస్త లీక్ చేశారు. సునీల్, హర్ష వర్థన్, నరేశ్ వంటి సీనియర్ నటుల నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానన్నారు. అన్నయ్యా నేనూ బ్రదర్స్‌లాగా కాకుండా క్లోజ్ ఫ్రెండ్స్‌లా వుంటామని ఆయన తెలిపారు. హీరో అవ్వడానికి నేను ఎంత కష్టపడ్డానో.. నువ్వు కూడా అలాగే శ్రమించాలని విజయ్ ఒకరకంగా వార్నింగ్ ఇచ్చారని ఆనంద్ గుర్తుచేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout