బర్త్‌డే సందర్భంగా 3 సినిమాలను అనౌన్స్ చేసిన ఆనంద్ దేవరకొండ

  • IndiaGlitz, [Monday,March 15 2021]

హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ఆనంద్ దేవరకొండ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దొరసాని, మిడిల్ క్లాస్ మెలొడీస్ చిత్రాలతో కమర్షియల్ సక్సెస్‌తో పాటు ప్రతిభ గల హీరోగా పేరు తెచ్చుకున్నాడు. క్రేజీ సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోగా ఆనంద్ దేవరకొండ మారాడు. ఇవాళ (సోమవారం) ఆనంద్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఏకంగామూడు మూడు కొత్త ప్రాజెక్టులను ఆనంద్ అనౌన్స్ చేశాడు. ఆ కొత్త సినిమాలు ఏంటంటే.. మధురా శ్రీధర్ రెడ్డి నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ సినిమా ప్రకటించారు.

అలాగే బలరాం వర్మ నంబూరి, బాల సోమినేని చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని మధురా ఎంటర్‌టైన్‌మెంట్స్, రోల్ కెమెరా విజువల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు, ఇతర కాస్ట్ అండ్ క్రూ ఎవరు అనే వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఆనంద్ దేవరకొండ అనౌన్స్ చేసిన మరో చిత్రాన్ని హై లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ సంస్థ తన తొలి చిత్రంగా నిర్మిస్తోంది. కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలు. ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ ఉదయ్ శెట్టి రూపొందించనున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రకటించనున్నారు.

ఇక మూడో సినిమా.. ప్రతిష్టాత్మక సురేష్ ప్రొడక్షన్స్‌లో ఆనంద్ దేవరకొండ చేయబోతున్నాడు. దానికి సంబంధించి అఫీషియల్‌గా అనౌన్స్ చేయకపోయినా సినిమా మాత్రం కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాతో కొత్త దర్శకుడు పరిచయం కానున్నారని తెలుస్తోంది. దీంతో పాటు ఆనంద్ దేవరకొండ బర్త్‌డే సర్‌ప్రైజ్‌ను కూడా ‘పుష్కకవిమానం’ మేకర్స్ రిలీజ్ చేశారు. పుట్టినరోజ సందర్భంగా రిలీజ్‌కు రెడీ అయిన ‘పుష్పక విమానం’ నుంచి ‘సిలకా’ అనే సాంగ్‌ను రిలీజ్ చేసిన ఆనంద్.. తను చేయబోయే 3 సినిమాలను కూడా అనౌన్స్ చేసి దూకుడు పెంచాడు.

More News

'హరిహర వీరమల్లు'... కాస్ట్యూమ్స్‌ ప్రత్యేకతలివే!

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌, డైరెక్టర్‌ క్రిష్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'హరిహరవీరమల్లు'. ఎ.ఎం.రత్నం నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ చకచకా జరుగుతోంది.

గుణశేఖర్-సమంత పాన్ ఇండియా మూవీ.. షూటింగ్ ప్రారంభం

అక్కినేని వారి కోడలు సమంత ఒక కథానాయికా ప్రాధాన్యమున్న పాత్రలో నటించి మెప్పించనుంది. ఇది ఒక క్లాసికల్ మూవీగా రూపొందనుంది. దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ‌శేఖ‌ర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్

పవర్ స్టార్ బాటలోనే సూపర్‌స్టార్.. సేమ్ సీక్రెట్...!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాటలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నడుస్తున్నారు. అభిమానులకు పోటీ పడి మరీ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

రైతులకు మద్దతుగా గళం విప్పిన గవర్నర్ సత్యపాల్

రైతులకు మద్దతుగా బీజేపీకి చెందిన ప్రముఖులే నిలుస్తుండటం విశేషం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిను మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పటికీ ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.

నవీన్ పొలిశెట్టి కోసం క్యూ కట్టిన ప్రముఖ నిర్మాణ సంస్థలు

మొదటి సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో తన సత్తా చాటిన హీరో నవీన్ పొలిశెట్టి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటించిన ‘జాతిరత్నాలు’ విడదలై బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తోంది.