బర్త్‌డే సందర్భంగా 3 సినిమాలను అనౌన్స్ చేసిన ఆనంద్ దేవరకొండ
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ఆనంద్ దేవరకొండ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దొరసాని, మిడిల్ క్లాస్ మెలొడీస్ చిత్రాలతో కమర్షియల్ సక్సెస్‌తో పాటు ప్రతిభ గల హీరోగా పేరు తెచ్చుకున్నాడు. క్రేజీ సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోగా ఆనంద్ దేవరకొండ మారాడు. ఇవాళ (సోమవారం) ఆనంద్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఏకంగామూడు మూడు కొత్త ప్రాజెక్టులను ఆనంద్ అనౌన్స్ చేశాడు. ఆ కొత్త సినిమాలు ఏంటంటే.. మధురా శ్రీధర్ రెడ్డి నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ సినిమా ప్రకటించారు.
అలాగే బలరాం వర్మ నంబూరి, బాల సోమినేని చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని మధురా ఎంటర్‌టైన్‌మెంట్స్, రోల్ కెమెరా విజువల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు, ఇతర కాస్ట్ అండ్ క్రూ ఎవరు అనే వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఆనంద్ దేవరకొండ అనౌన్స్ చేసిన మరో చిత్రాన్ని హై లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ సంస్థ తన తొలి చిత్రంగా నిర్మిస్తోంది. కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలు. ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ ఉదయ్ శెట్టి రూపొందించనున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రకటించనున్నారు.
ఇక మూడో సినిమా.. ప్రతిష్టాత్మక సురేష్ ప్రొడక్షన్స్‌లో ఆనంద్ దేవరకొండ చేయబోతున్నాడు. దానికి సంబంధించి అఫీషియల్‌గా అనౌన్స్ చేయకపోయినా సినిమా మాత్రం కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాతో కొత్త దర్శకుడు పరిచయం కానున్నారని తెలుస్తోంది. దీంతో పాటు ఆనంద్ దేవరకొండ బర్త్‌డే సర్‌ప్రైజ్‌ను కూడా ‘పుష్కకవిమానం’ మేకర్స్ రిలీజ్ చేశారు. పుట్టినరోజ సందర్భంగా రిలీజ్‌కు రెడీ అయిన ‘పుష్పక విమానం’ నుంచి ‘సిలకా’ అనే సాంగ్‌ను రిలీజ్ చేసిన ఆనంద్.. తను చేయబోయే 3 సినిమాలను కూడా అనౌన్స్ చేసి దూకుడు పెంచాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com