ఆనంద్ దేవరకొండ, వైరల్ బ్యూటీ జంటగా.. సెట్స్ పైకి 'హైవే'
Send us your feedback to audioarticles@vaarta.com
రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కొత్త చిత్రం షురూ అయింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కెవి గుహన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి 'హైవే' అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. 'ఎ నర్వ్ వ్రాకింగ్ రైడ్ స్టోరీ' అనేది ట్యాగ్ లైన్.
ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ నేడు ప్రారంభం అయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆసక్తికర విశేషాలని వెల్లడించారు. ట్రావెల్ మిస్టరీ కథతో థ్రిల్లింగ్ అంశాలతో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఆనంద్ దేవరకొండ సరసన ఈ చిత్రంలో పవన్ హీరోయిన్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన బ్యూటీ మానస రాధాకృష్ణన్ నటిస్తోంది.
శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్ బ్యానర్ లో వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన చుట్టాలబ్బాయి చిత్రాన్ని నిర్మించి అభిరుచిగల నిర్మాతగా గుర్తింపు పొందారు.
నిర్మాత వెంకట్ మాట్లాడుతూ గుహన్ గారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సైకో క్రైమ్ అంశాలు ప్రేక్షకులని మెప్పిస్తాయి. భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ జంటగా నటిస్తున్నారు. మరికొంతమంది ప్రముఖ నటులు కూడా నటిస్తున్నారు. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అని నిర్మాత అన్నారు.
టెక్నికల్ గా చాలా అడ్వాన్స్డ్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు దర్శకుడు గుహన్ అన్నారు. సైమన్ కె కింగ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments