ఆనంద్ దేవరకొండ, వైరల్ బ్యూటీ జంటగా.. సెట్స్ పైకి 'హైవే'

  • IndiaGlitz, [Wednesday,July 14 2021]

రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కొత్త చిత్రం షురూ అయింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కెవి గుహన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి 'హైవే' అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. 'ఎ నర్వ్ వ్రాకింగ్ రైడ్ స్టోరీ' అనేది ట్యాగ్ లైన్.

ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ నేడు ప్రారంభం అయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆసక్తికర విశేషాలని వెల్లడించారు. ట్రావెల్ మిస్టరీ కథతో థ్రిల్లింగ్ అంశాలతో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఆనంద్ దేవరకొండ సరసన ఈ చిత్రంలో పవన్ హీరోయిన్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన బ్యూటీ మానస రాధాకృష్ణన్ నటిస్తోంది.

శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్ బ్యానర్ లో వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన చుట్టాలబ్బాయి చిత్రాన్ని నిర్మించి అభిరుచిగల నిర్మాతగా గుర్తింపు పొందారు.

నిర్మాత వెంకట్ మాట్లాడుతూ గుహన్ గారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సైకో క్రైమ్ అంశాలు ప్రేక్షకులని మెప్పిస్తాయి. భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ జంటగా నటిస్తున్నారు. మరికొంతమంది ప్రముఖ నటులు కూడా నటిస్తున్నారు. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అని నిర్మాత అన్నారు.

టెక్నికల్ గా చాలా అడ్వాన్స్డ్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు దర్శకుడు గుహన్ అన్నారు. సైమన్ కె కింగ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

More News

హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ పై గోపీచంద్ కన్ను.. మూడోసారి ఆ డైరెక్టర్ తో..

యాక్షన్ హీరో గోపీచంద్ జోరు మాములుగా లేదు. ప్రస్తుతం గోపీచంద్ నటిస్తున్న రెండు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి.

'నారప్ప' ట్రైలర్: వెంకటేష్ మాస్ విశ్వరూపం

విక్టరీ వెంకటేష్ నటించిన 'నారప్ప' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత వెంకీ రఫ్ లుక్ లో మాస్ పెర్ఫామెన్స్ అందించబోతున్న చిత్రం ఇది.

'SR కల్యాణమండపం' టీజర్.. పంచ్ డైలాగ్, యాటిట్యూడ్ అదుర్స్!

యువ నటుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం 'SR కల్యాణమండపం'. టాక్సీవాలా ఫేమ్ హాట్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది.

హీరోలు పడుకోమన్నారు.. నిలదొక్కుకోవాలంటే తప్పదు, ఎన్నో సినిమాలు

శృంగార తార మల్లికా శరావత్ తన బోల్డ్ రోల్స్ తో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని ఒక ఊపు ఊపిన నటి.

బంధువులు ఆ కారు కొన్నారని.. రేసింగ్ పై హీరోయిన్ పిచ్చి.. 

హాట్ బ్యూటీ నివేద పేతురాజ్ కు రియల్ లైఫ్ లో ఓ సరదా ఉంది. సరదా కంటే పిచ్చి అంటే బెటర్ ఏమో.