'అనగనగా ఒక ఊళ్ళో' ఆడియో ఆవిష్కరణ
Send us your feedback to audioarticles@vaarta.com
అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో చంద్రబాలాజీ ఫిలిమ్స్ పతాకంపై సాయికృష్ణ కె.వి. ని దర్శకుడిగా పరిచయం చేస్తూ కె.చంద్రరావు నిర్మిస్తున్న చిత్రం 'అనగనగా ఒక ఊళ్ళో'. పల్లెటూరికి వినోద యాత్ర అనేది ట్యాగ్‌లైన్. అశోక్‌కుమార్, ప్రియాంక శర్మ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుక ఇటీవల అత్యంత వైభవంగా జరిగింది.
హీరో శ్రీకాంత్ ముఖ్య అతిధిగా వచ్చిన ఈ కార్యక్రమంలో నిర్మాత కె.చంద్రరావు, బాలాజీ, శ్రీతేజ్, మనోజ్, బెనర్జీ, సుమన్, దర్శకుడు సాయికృష్ణ కె.వి, సంగీత దర్శకుడు యాజమాన్య, కెమెరామెన్ రాజశేఖర్ ఎస్, హీరో అశోక్‌కుమార్, హీరోయిన్ ప్రియాంక శర్మ, దేవిప్రసాద్, వంశీ ఆకెళ్ళ, డిజె వసంత్, హేమ, లిరిక్ రైటర్ రాంబాబు, సురేష్ కొండేటి, సుధీర్‌రాజు, రామకృష్ణ, సింగర్ లిప్సిక తదితరులు హాజరయ్యారు.
ముఖ్య అతిధిగా వచ్చిన హీరో శ్రీకాంత్ 'అనగనగా ఒక ఊళ్ళో' చిత్ర బిగ్ సీడిని విడుదల చేసారు. థియేట్రికల్ ట్రైలర్‌ను హీరో నవీన్ చంద్ర విడుదల చేసారు.
అనంతరం హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ... టైటిల్ చాలా బాగుంది. పల్లెటూరు వాతావరణం ఈ చిత్రంలో చూడబోతున్నాం. సంగీత దర్శకుడు యాజమాన్య మంచి ఆల్బమ్‌ను అందిస్తాడు. ఇంతకుముందు నేను నటించిన 'నాటుకోడి' చిత్రానికి మంచి మ్యూజిక్‌ని ఇచ్చాడు. ఈ చిత్రంలోని సాంగ్స్ కూడా చాలా బాగా వుంటాయని నమ్ముతున్నాను. అలాగే ఈ చిత్రం కూడా మంచి సక్సెస్ అయ్యి దర్శక నిర్మాతలకు, ఆర్టిస్ట్‌లకు, టెక్నీషియన్లకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
సుమన్ మాట్లాడుతూ... ఈ చిత్ర నిర్మాత చంద్రరావు గారికి, దర్శకుడు సాయి గారికి, కెమెరామెన్ రాజశేఖర్ గారికి, సంగీత దర్శకుడు యాజమాన్య గారికి, హీరో అశోక్, హీరోయిన్ ప్రియాంక, మిగతా ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు ప్రతీ ఒక్కరికి ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. రాజమౌళి గారి శిష్యుడు సాయి చాలా మంచి దర్శకుడు. చాలా బాగా తీసాడు. ఈ చిత్రంలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేసారు. ఈ చిత్రంలో అన్ని ఎలిమెంట్స్ వుంటాయి. కేవలం ఒక విలేజ్ ప్రేక్షకులనే కాకుండా సిటీ ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది. పాటలు చాలా బాగున్నాయి. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా ఖచ్చు పెట్టారు. మంచి ట్విస్ట్‌లతో, డిఫరెంట్ లొకేషన్లలో, చక్కని విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన 'అనగనగా ఒక ఊళ్ళో' చిత్రం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
దేవిప్రసాద్ మాట్లాడుతూ... ఈ మధ్య పల్లెటూరు బ్యాక్‌డ్రాప్ చిత్రాలు ఎక్కువగానే వస్తున్నాయి. ఆ పల్లెటూరు అందాలు చూసి చాలా కాలమైంది. ఇక ఈ చిత్రం గురించి చెప్పేకన్నా చూస్తేనే బాగుంటుంది. ఈ చిత్ర దర్శకుడు సాయికృష్ణ నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసాడు. సినిమా అంటే అతనికి ప్రాణం. చాలా మంచి చిత్రం తీసి వుంటాడని నేను భావిస్తున్నాను. ఫ్యూచర్లో ఒక మంచి దర్శకునిగా సాయికృష్ణ ఎదగాలని కోరుకంటున్నాను. ఫొటోగ్రఫీ చాలా బాగుంది. 'అనగనగా ఒక ఊళ్ళో' చిత్రం విజయవంతమై దర్శక నిర్మాతలకు, టెక్నీషియన్లను, నటీనటులకు మంచి పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నాను అన్నారు.
హేమ మాట్లాడుతూ... పాటలు చాలా బాగున్నాయి. హీరో, హీరోయిన్ చాలా బాగా చేసారు. డెఫినెట్‌గా ఈ 'అనగనగా ఒక ఊళ్ళో' చిత్రం మంచి హిట్ అయి దర్శక నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుందని కోరుకుంటున్నాను అన్నారు.
బెనర్జీ మాట్లాడుతూ... ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ ఈ చిత్రం అలా కాకుండా మంచి టాలెంట్ వున్న టెక్నీషియన్స్, నటీనటులతో కొత్తవారయినప్పటికీ, చాలా బాగా చేసారు. ఈ చిత్రం మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
వంశీ ఆకెళ్ళ మాట్లాడుతూ... 'అనగనగా ఒక ఊళ్ళో' ఆడియో ఫంక్షన్‌కి వచ్చిన అతిధులందరికీ కృతజ్ఞతలు. అందరూ ఇది ఒక చిన్న చిత్రంలా భావిస్తున్నారు. కానీ ఒక పెద్ద దర్శకుడైనా, పెద్ద హీరో అయినా వారి మొదటి చిత్రం ఖచ్చితంగా చిన్న సినిమానే. నా అబ్జర్వేషన్లో చిన్న సినిమా అంటే రిలీజ్ తర్వాత ప్రేక్షకులచేత చిన్నచూపు చూడబడే సినిమా. కానీ మామూలు బడ్జెట్ పరంగా చిన్న చిత్రం కాదు. ఒక పెద్ద చిత్రం అంటే ప్రేక్షకులు పెద్ద చెప్పుకునే చిత్రం. ఇక ఈ చిత్రం రిలీజ్ తర్వాత ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్ద చిత్రంగా చేస్తారనే నమ్మకం నాకుండి. ఈ చిత్రంలోని పాటలు చాలా బాగున్నాయి. ఈ మ్యూజిక్‌లో నాకు పల్లెటూరు కన్పించింది. 'రంగస్థలం' చిత్రానికి పోటీగా ఈ 'అనగనగా ఒక ఊళ్ళో' చిత్రం వుండేలా దర్శకుడు సాయి చాలా చక్కగా తీర్చిదిద్దాడు. ఈ రెండు చిత్రాలూ పల్లెటూరు బ్యాక్‌డ్రాప్ చిత్రాలే. ఈ చిత్రంలో హీరో చాలాబాగా చేసాడు. ఈ చిత్రం మంచి సక్సెస్ అయి నిర్మాతకు మంచి లాభాలు, దర్శకునికి మంచి పేరు, హీరోయి మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నవీన్ చంద్ర మాట్లాడుతూ... ప్రతి ఆర్టిస్ట్‌కి తన మొదటి చిత్రం చాలా ఇంపార్టెంట్. నా మొదటి చిత్రానికి నేనూ కొత్తవాడినే. ఈ చిత్ర హీరో అశోక్ నాకు ఒక సంవత్సరం నుంచి బాగా తెలుసు. మంచి ఫ్రెండ్. ఈ చిత్రం సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను అన్నారు.
సుధీర్‌రాజు మాట్లాడుతూ... సంగీత దర్శకుడు యాజమాన్య గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రం చాలా బాగుంటుందని నా నమ్మకం. చంద్రబాలాజీ మూవీస్‌లో చాలా కష్టపడి పైకొచ్చి 2వ చిత్రంగా 'అనగనగా ఒక ఊళ్ళో' చిత్రాన్ని చేస్తున్నారు. ఈ టీమ్ మొత్తం చాలా కష్టపడ్డారు. హీరో అశోక్ గారికి ఇది తొలి చిత్రం. తన రెండవ చిత్రాన్ని భారీ బడ్జెట్ చిత్రంగా తీయడానికి సన్నాహాలు చేస్తున్నాము. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తాను అన్నారు.
నిర్మాత బాలాజీ మాట్లాడుతూ... రాజమౌళి గారి దగ్గర వర్క్ చేసిన సాయికృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. అలాగే అశోక్‌కుమార్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ 'అనగనగా ఒక ఊళ్ళో' చిత్రంలో ప్రియాంక శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి మంచి ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ కుదిరారు. ఈ చిత్రాన్ని రాజోలు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాం. రాజోలు పరిసర ప్రాంతాంల్లో తీసిన అన్ని చిత్రాలు ఘనవిజయాన్ని సాధించాయి. అలాగే మా 'అనగనగా ఒక ఊళ్ళో' చిత్రాన్ని కూడా ప్రేక్షకులు హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. అతి త్వరలోనే ఈచిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అన్నారు.
నిర్మాత శ్రీతేజ్ మాట్లాడుతూ... మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ప్రముఖ దర్శకులు సుకుమార్ గారు 'రంగస్థలం' చిత్ర షూటింగ్లో బిజీగా వుండటం వలన ఇక్కడకు రాలేకపోయారు. ఆయన అక్కడ ఎంత బిజీగా వున్నాసరే మా చిత్ర యూనిట్‌ని అభినందిస్తూ ఒక వీడియో బైట్ ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అశోక్, ప్రియాంక జంటగా మేము తీసిన 'అనగనగా ఒక ఊళ్ళో' చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని, మేము చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.
సంగీత దర్శకుడు యాజమాన్య మాట్లాడుతూ... ఈ చిత్రానికి మంచి పాటలు కుదిరాయి. మా హీరో చాలా కష్టపడి, ఇష్టపడి ఈ చిత్రంలో నటించాడు. ఈ చిత్రానికి నాకు పని చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. మీ అందరి బ్లెస్సింగ్స్‌తో ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు సాయికృష్ణ కె.వి. మాట్లాడుతూ... ఇప్పటివరకు నేను 15 చిత్రాలకు వర్క్ చేసాను. ప్రముఖ దర్శకులు రాజమౌళి గారి దగ్గర వర్క్ చేస్తూనే నేను చాలా నేర్చుకున్నాను. ఆ అనుభవంతో నేను కొన్ని కథలు రాసుకున్నాను. ఈ చిత్ర నిర్మాతకు ఈ కథ బాగా నచ్చడంతో 'అనగనగా ఒక ఊళ్ళో' ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేసాం. మా నిర్మాత చంద్రగారు మృధుస్వభావి, చాలా మంచి వ్యక్తి. రాజోలు పరిసర ప్రాంతాల్లో అక్కడి ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, అక్కిరాజు, శ్రీనుబాబు, నాయుడు, దేవా గార్ల సపోర్ట్‌తో ఎలాంటి ఆటంకం లేకుండా 40 రోజులు షూటింగ్ చేసాం. చాలా బాగా వచ్చింది. పాటలు చాలా బాగా వున్నాయని చాలా మంచి ఫోన్స్ చేసి అభినందిస్తున్నారు. ఈ నెలలోనే 'అనగనగా ఒక ఊళ్ళో' చిత్రాన్ని విడుదలన చేయబోతున్నాం అన్నారు.
హీరోయిన్ ప్రియాంక శర్మ మాట్లాడుతూ... ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. సాంగ్స్ బాగున్నాయి. పిక్చరైజేషన్ ఇంకా చాలా బాగుంటుంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
హీరో అశోక్ కుమార్ మాట్లాడుతూ... నేను సినిమా ఫీల్డ్‌లోకి రావడానికి మా పేరెంట్స్ సపోర్ట్ ఎంతో వుంది. నాకు హీరోగా ఛాన్స్ ఇచ్చిన నిర్మాతకు, నన్ను హీరోగా సెలెక్ట్ చేసుకున్న దర్శకునికి కృతజ్ఞతలు. ఇది నా మొదటి చిత్రం. నా నుంచి నటనను మా దర్శకులు రాబట్టుకున్నారు. దర్శకులు సాయి గారు నాకు మంచి సపోర్ట్ చేసారు. మా నిర్మాతలు కూడా ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. యాజమాన్య గారు అందించిన పాటలు అద్భుతంగా వచ్చాయి. హీరోయిన్ ప్రియాంక కూడా చాలా బాగా చేసింది. ఈ నెలలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మంచి ఫీల్‌ని కలిగించే ఈ 'అనగనగా ఒక ఊళ్ళో' చిత్రం పల్లెటూరు బ్యాక్‌డ్రాప్‌లో వున్నా అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా వుంటుంది అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com