ఈ విజయానికి కారకులైన ప్రక్షకులకు ధన్యవాదాలు 'అనగనగా ఒక చిత్రవ్‌ు' టీం

  • IndiaGlitz, [Saturday,December 12 2015]

పద్మాలయ శాఖమూరి మల్లిఖార్జునరావు తనయుడు శివ హీరోగా మేఘశ్రీ హీరోయిన్‌గా జె ప్రొడక్షన్స్ పతాకంపై గోవర్షిణి ఫిలింస్ సమర్పణలో సూపర్‌హిట్ అయిన ప్రేమకథాచిత్రవ్‌ు' దర్శకులు జె. ప్రభాకర్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో కొడాలి సుబ్బారావుతో కలిసి నిర్మించిన పూర్తి హాస్యరస ప్రేమకథా విచిత్రవ్‌ు అనగనగా ఒక చిత్రవ్‌ు'. డిసెంబర్ 11న విడుదలైన ఈ చిత్రం అన్ని సెంటర్లలోనూ విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా హీరో శివ మాట్లాడుతూ.. విడుదలైన అన్ని సెంటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది. పంపిణీదారులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఎక్కడా బోర్ కొట్టకుండా కామెడీ బాగా పండింది అని అంటున్నారు. ఈ చిత్ర విజయానికి కారకులైన ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.

దర్శకుడు జె. ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. టీం అంతా కష్టపడి పనిచేసిన దానికి నిన్న ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్‌కు చాలా హ్యాపీగా అనిపించింది. మల్లయ్యగారి సపోర్ట్‌తో అభిమానులకు నచ్చే విధంగా, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కొత్త విధానంలో కామెడీ జోడించి తీశాము. ప్యాడింగ్ ఆర్టిస్ట్‌లు అందరూ తమ స్వంత బ్యానర్‌లా భావించి చేశారు. చిన్న సినిమాకు పెద్ద ఆర్టిస్ట్‌లు రావడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాను అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని అన్నారు.

హీరోయిన్ మేఘశ్రీ మాట్లాడుతూ.. ఈ సినిమా విజయం తర్వాత నేను ఇలా కూర్చుని మాట్లాడడానికి కారకులైన మల్లయ్య గారికి ధన్యవాదాలు. అందరూ ఈ మూవీ చూసి ఈ సినిమాను ఇంకా పెద్ద సక్సెస్ చేయాలి అన్నారు.

పద్మాలయా మల్లయ్య మాట్లాడుతూ.. హీరో, హీరోయిన్‌లు, ఆర్టిస్ట్‌లు అందరూ చాలా కష్టపడి పనిచేశారు. ఈ సినిమా వారందరికీ మంచి పేరు తెచ్చింది. దర్శకుడు మంచి లొకేషన్ సెలక్ట్ చేసుకుని బాగా చేశాడు. ఈ సినిమా విజయానికి కారకులైన ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.

జయప్రకాష్‌రెడ్డి, షియాజిషిండే, వెన్నెల కిశోర్, ప్రభాస్ శ్రీను, సూర్య, గిరిబాబు, రఘుబాబు, పృథ్వీ, అనంత్, జోగి బ్రదర్స్, దువ్వాసి మోహన్, గుండు సుదర్శన్, అల్లరి సుభాషిని, కృష్ణ వేణి (భాహుబలి ఫేం), బ్యాంకు విజయ్, వాజ్‌పాయ్, కోటేశ్వరరావు, గగన్, డి.వి. మధు. తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ, మాటలు: అజయ్, ఫోటోగ్రఫీ: వి. రవికుమార్, సంగీతం: వినోద్ యాజమాన్య, ఎడిటింగ్: టి. సాయి బాబు, ఆర్ట్: విజయ్‌కృష్ణ, మేకప్: రంగా, కాస్టుమ్స్: కె. మురళి, స్టిల్స్: బాలు, పి.ఆర్.ఓ: బాలాజీశర్మ, పబ్లిసిటీ డిజైన్స్: వెంకట్ యమ్, నిర్మాణ నిర్వహణ: నల్లూరి శ్రీనివాస్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కొడాలి శ్రీనివాసరావు, ప్రొడక్షన్ మేనేజర్: ఆర్. రాంబాబు, అసిస్టెంట్ డైరక్టర్స్: సుదర్శన్, హరీష్ సజ్జా, అసోసియేట్ డైరెక్టర్స్: ఉమేష్ నాగ డి.యమ్. మంజునాథ్ సజ్జన్, కో డైరెక్టర్: ఎస్. నాగశ్రీనివాసరావు, నిర్మాతలు: కొడాలి సుబ్బారావు, జె. ప్రభాకరరెడ్డి, డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జె. ప్రభాకరరెడ్డి.